మొటిమ రహితమైన చర్మం కోసం “ఫేస్ ప్యాక్స్” , “ఫేస్ మాస్క్స్” – How to remove pimples

మిమ్మల్ని మొటిమలు వేదిస్తున్నాయ, ఎన్ని రకములుగా ప్రయత్నించినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నరా, మీ చర్మం మొటిమ రహితంగా కావాలంటే ఈ సహజ పద్దతులు పాటించండి మంచి ఫలితాలతో పాటు అందమైన, సొగసైన చర్మాన్ని పొందుతారు. సహజ పద్దతులంటే పండ్లు, మూలికలతో మీ సమస్యని  దూరం చేసి మీ శరీరం పై మంచి ప్రభావాన్ని చూపించి మీ ముఖం పై మచ్చలు లేకుండా అందంగా మారుస్తుంది. ఈ పద్దతులు శరీరం పై ఏ దుష్ప్రబావం లేకుండా మొటిమలపై పోరాట పటిమను ప్రదర్శిస్తాయి, మొటిమల నిర్మూలన కోసం చర్మ వైద్య నిపుణులు సూచించిన కొన్ని సహజ పద్దతులు మీకోసం:

“కలబంద మరియు పసుపు” ప్యాక్:

కలబందలోని enzymes అయిన Polysaccharides మరియూ న్యూట్రీన్లు,  antibacterial&antifungal  గా పోరాట ప్రతిభను ప్రదర్శిస్తాయి.

ఇది సహజ టాక్సిన్స్ వ్యతిరేకంగా పోరాడి చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచుటలో సహాయపడుతుంది .

పసుపు:

పసుపు మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలొ సహాయపడుతుంది.

మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో  వాపుని కరిగించుటలో  సహాయ పడుతుంది.

మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.

“ఫసుపు, తేనే, పాల”  ప్యాక్:

1 Tbsp పసుపు, తేనె, పన్నిరు, మరియు కలబంద కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే, మచ్చ మరియు మొటిమ రహితమైన చర్మం పొందుతారు.

“సిట్రస్ పండ్లు” ప్యాక్ :

సిట్రస్ పండ్లు నిమ్మ, నారింజ, అనేవి రక్త స్రావ లక్షణాలు కలిగి, చర్మంలోని “బ్యాక్టీరియ”ను తుడిచేసి చర్మాన్ని తేజోవంతంగా, మరియు అందంగా ఉంచుతుంది.

ఈ పండ్ల యొక్క గుజ్జుని ముఖమునకు రాసుకుని, 15 నిమిషాలు అలాగే ఉంచాలి, అంతేకాకుండా నిమ్మరసాన్ని ముల్తాని మట్టీ,నీరు కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు, ముల్తాని మట్టి వల్ల మొటిమల పెరుగుదలని అణచి వేస్తుంది, ఈ విధముగా ముఖమునకు రాసుకుని కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రపరచాలి.

 

ముందు మీ చర్మం యొక్క తత్వాన్ని అర్దం చేసుకోండి :

ఈ సహజ పద్దతులు అన్నీ ఎంతో మంచి ఫలితాలని ఇచ్చేవే, కాకపోతే మీ శరీర యొక్క తత్వాన్ని అర్దం చేసుకుని వాడుట ఎంతో శ్రేయస్కరం.

 

సాదారణ చర్మం :

ఒకవేళ మీ చర్మం సాధారణ రకం అయితే మీ చర్మం యొక్క కణాలు అ విదమైన జిడ్డుని విడువవు.

సాధారణ చర్మం అతి స్వల్ప సమస్యాత్మక శరీరం.

 

పొడి చర్మం:

ఒకవేళ మీది పొడి చర్మం అయితే కాగితం చాల పొడిగా ఉండి తీసినవెంటనే మీ చర్మం గట్టిగా, పొడిగా, పొరలుగా అనిపిస్తుంది.

 

జిడ్డు చర్మం:

మీది జిడ్డు చర్మం అయితే కాగితం, మీ ముఖ భాగంలోని  బుగ్గలు, ముక్కు, మరియు నుదురు సంబంధిత ప్రదేశాలలో, జిడ్డుని గ్రహిస్తుంది.

ఈ చర్మం, ఎంతో సమస్యాత్మకమైనది, ఇది పేలగ, మందముగా కనిపిస్తుంది.అందువల్ల మోటిమలు పెరిగే అవకాసం ఎక్కువ.

 

కలయిక చర్మం:

చాల మంది స్త్రీలలో ఈ కలయిక చర్మం ఎక్కువగా ఉంటుంది.

ఈ చర్మం పై కాగితం ముక్కు, నుదురు పై తప్పితే బుగ్గలపై జిడ్డు గ్రహించదు.

 

సున్నితమైన చర్మం:

సున్నితమైన చర్మం సాధారణంగా చాలా పొడి ఉండి గట్టి అనుభూతినిస్తుంది.

ఎక్కువగా వాపు రావడం, చిరాకు కలగడం,దురద పుట్టడం, చర్మం ఎర్రగ అవడం,చివరకు ముఖం పై చిన్న చిన్న మచ్చలకు దారితీస్తుంది

 

పాలు: పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది పొడి చర్మానికి చాలా ఉపయోగపడుతుంది,

జిడ్డు చర్మాన్ని పాలకు దూరంగా ఉంచడం చాల అవసరం ఎందుకంటే పాలలో ఉన్న కొవ్వు వల్ల జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారే ప్రమాదం ఉంది.

సిట్రస్ పండ్లు: ఇది పొడి చర్మం పై ఉపయోగిస్తే, తేమని తొలగించి మరింత పొడిగా మారుస్తుంది.అందుకే జిడ్డు చర్మం పై ఉపయోగిస్తే జిడ్డుని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

సాదారణ చర్మం కలవారు బాగా సాంద్రత తగ్గిన నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు

తేనె: ఇది సాదారణంగా తేమను తగ్గించేదిగా పని చేస్తుంది, అందువల్ల అన్ని రకముల చర్మాలకు ఉపయోగించుకోవచ్చు .

NO COMMENTS