Benefits of glucose in Telugu – గ్లూకోజ్ ప్రయోజనాలు

గ్లూకోజ్ అనేది పిండి పదార్ధాల నుండి మార్పిడి చేయబడిన ఒక రకమైన చక్కెర పదార్ధము.  ఈ మార్పిడి ప్రక్రియ కాలేయము చేత జరుగుతుంది. గ్లూకోజ్ మెదడుకు మరియు కండరాల పనితీరుకు శక్తిని పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో అదనపు మొత్తంలో గ్లూకోజ్ ఉన్నట్లయితే అది గ్లైకోజేన్ గా నిల్వ చేయబడుతుంది. అది తరువాత శరీర శ్రమ మరియు వ్యాయమ సమయంలో ఖర్చు అవుతుంది.

వ్యాయామ సమయంలో సరిపడా గ్లూకోజ్ నిల్వలను మీరు కలిగి ఉండకపోతే అది హైపో గ్లైసీమియా అనే సమస్యకు దారితీస్తుంది. అది శారీరక మరియు మానిసిక ఆరోగ్యాలకు అలసట కలగజేస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది నీరసాన్ని మరియు మైకాన్ని కూడా కలిగిస్తుంది. పని చేస్తున్న కండరాలకు గ్లూకోజ్ నుండి సరిపడా శక్తి అవసరం, లేదంటే అవి ప్రోటీన్లను శక్తి కోసం వాడుకోవడం జరుగుతుంది. ఇలా జరిగితే  మూత్రపిండాలు అలసటకు గురవుతాయి. ఈ ప్రోటీన్లు అసలైన ప్రక్రియ కండరాల నిర్మాణానికి బదులుగా శక్తిగా మార్చబడటానికి కొనసాగుతాయి.

గ్లైకోజెన్

గ్లైకోజెన్ క్రీడాకారుల కండరాలకు బలాన్ని సమకూర్చే వనరులు. ఇవి కాలేయం మరియు అస్థిపంజర కండరాలలో నిల్వచేయబడతాయి. ఇవి సరిపడా కార్బోహైడ్రేట్ల నిల్వలు లేకుండా దీర్ఘ వ్యాయామము లేదా పని చేస్తున్నప్పుడు రక్తంలో పంపిణీ చేయబడిన గ్లూకోజ్ కంటే అదనంగా శరీరం శక్తిని కోరినప్పుడు ఈ గ్లైకోజెన్ మెదడుకు మరియు కండరాలకు శక్తిని సరఫరా చేస్తుంది.  

స్వల్ప వ్యాయామాల సమయంలో నిల్వచేయబడిన గ్లైకోజెన్ 90 నిముషాలకు సరిపడా గ్లూకోజ్ స్థాయిని పెంచబడుతుంది. అయితే అధిక తీవ్రతగల వ్యాయామాల సమయంలో నిల్వ చేయబడిన గ్లైకోజేన్ కేవలం 20 నిముషాల వరకు మాత్రమే శక్తిని అందిస్తుంది. అందువలన మరింత మొత్తంలో పిండి పదార్ధాలను ఖర్చు చేయడం ద్వారా గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. ఎవరైతే గ్లైకోజెన్ సహాయముతో వారి అదనపు శరీర శ్రమను నిర్వహించుకోగలుగుతారో వాళ్ళు గ్లూకోజ్ ను చాలా తక్కువ కొవ్వు నిల్వలుగా కలిగి ఉంటారు.

వ్యాయామ సమయంలో మంచి గ్లూకోజ్ స్థాయిలను పొందడానికి  సాధారణ కార్బోహైడ్రేట్లు కంటే క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు మరింత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. పిండి, రొట్టె, పాస్తా, పీచు పదార్ధాలు  మరియు తృణధాన్యాలు సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల క్రిందకి వస్తాయి. అలాగే సాధారణ కార్బోహైడ్రేట్లు రసాలు మరియు పంచదారతో చేసిన తీపి పదార్ధాలలో ఉంటాయి. వ్యాయామ సమయంలో సాధారణ కార్బోహైడ్రేట్లు వినియోగం వలన చాలా త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. కానీ క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు సాధారణ కార్బోహైడ్రేట్లకు పూర్తిగా వ్యతిరేకం. అవి క్రమంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి కొన్ని గంటల వరకు నిలిచి ఉంటాయి.

వ్యాయామ సమయంలో సరిపడా గ్లూకోజ్ స్థాయిని పొందడానికి వ్యాయామానికి రెండు గంటల ముందు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఒక మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామంలో 90 నిముషాల తర్వాత గ్లూకోజ్ ను పునరుద్ధరించడానికి స్పోర్ట్స్ డ్రింక్ ను సేవించండి. షుగరు వ్యాధిగ్రస్తులు వారి రక్తంలో సరిపడా గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించాల్సిన అవసరం ఉంది లేదంటే వ్యాయామ సమయంలో రక్తం యొక్క హెచ్చు తగ్గులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని డయాబెటిస్ కలిగి వైద్య పరిధిలో ఉన్నవారు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వ్యాయామానికి ముందు మరియు తరువాత చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా డెసీ లీటరుకు 100 నుండి 250 మి.గ్రా, లేదా మి.గ్రా/డె.లీ అనేది వ్యాయామానికి ముందు ఉండాల్సిన రక్తంలో చక్కెర స్థాయికి ప్రామాణికం. మీరు ఈ పరిధి నుండి ఏదైనా తగ్గుదలను గమనించినట్లయితే కార్బోహైడ్రేట్ల స్నాక్స్ తో దానిని పైకి లేపండి. మీరు 250 మి.గ్రా/డె.లీ పరిధి కంటే ఎక్కువ చక్కర స్థాయిలను కలిగి ఉన్నట్లయితే మీరు కెటోయాసిడోసిస్ అని పిలవబడే ప్రమాదానికి దగ్గరవుతున్నట్లు చెప్పవచ్చు. అందువలన సురక్షిత స్థాయిలకు వచ్చేవరకు మీ వ్యాయామాన్ని వాయిదా వేయడం మంచిది.   

శరీర ఇంధనంగా గ్లూకోజ్

గ్లూకోజ్ అనేది మీరు తీసుకునే ఆహార పదార్ధాలు మరియు ద్రవపదార్దాల నుండి సేకరించబడుతుంది.  శరీర శ్రమ లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలు చక్కగా పని చేయడానికి మరియు వ్యాయామం చేసిన తర్వాత కూడా  తగిన మొత్తంలో మీ కండరాలకు ప్రోటీన్లను అందించడం అవసరం. గ్లూకోజ్ కు కొవ్వులకంటే తక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి అది అధిక శరీర శ్రమ వద్ద ఒక ఇంధనంగా ఉపయోగించబడుతుంది. శ్రమ తీవ్రత తరువాత స్థాయికి పెంచబడినప్పుడు మరింత ఎక్కువ గ్లూకోజ్ మీ శరీరానికి ఇంధనంగా అవసరం కావచ్చు. మీ శరీరం తక్కువ స్థాయిలో ఆక్సిజన్ పొందినప్పుడు మీరు గ్లూకోజ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.  మీరు తీవ్రమైన సుదీర్ఘ వ్యాయామానికి ప్రణాళిక చేస్తున్నప్పుడు మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పునరుద్ధరణ చేయాల్సి ఉంటుంది.

కండరాల పునరుద్ధరణలో గ్లూకోజ్ పాత్ర

2012 లో ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్’ వారిచే ప్రచురించబడిన ఒక పత్రికలో పేర్కొనబడినట్లుగా తీవ్ర వ్యాయామం తరువాత కండరాల పునఃనిర్మాణానికి ప్రోటీన్లు మరియు గ్లూకోజ్ రెండూ అవసరమవుతాయి. ప్రోటీన్ల సహాయంతో కండరాల నిర్మాణాన్ని పునఃనిర్మించడానికి గ్లూకోజ్ శక్తిని అందిస్తుంది.  అందువలన రోజూవారి వ్యాయామంలో కార్బోహైడ్రేట్లు అలాగే ప్రోటీన్లు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఆ పత్రికను అనుసరించి తీవ్ర వ్యాయామం తరువాత ఎంత త్వరగా మీరు గ్లూకోజ్ ను తీసుకున్నట్లయితే, అంత త్వరగా బలిష్టమైన కండరాల రూపకల్పనకు మీ కండరాల నిర్మాణం రిపేర్ ప్రక్రియకు లేదా పునఃనిర్మాణానికి ప్రారంభమవుతుందని కూడా కనుగొనబడింది.

ఏమి తినాలి?

ప్రజలు సాధారనంగా గ్లూకోజ్ ను తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది మన శరీరానికి అవసరమయిన  గరిష్ట గ్లూకోజ్ ని అందించగలదో తెలియక చాలా తికమక పడుతూ ఉంటారు. గ్లూకోజ్ ను ఒక సహజ మూల పదార్ధముగా కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు వంటి  కొన్ని నిర్ధిష్ట ఆహార పదార్ధాలలో కనుగొనవచ్చు. ఈ ఆహార మూలాలలో పీచు పదార్ధాలు వాటిని నింపడానికి దోహదం చేస్తాయి. మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో లేదా చేసిన తరువాత అరటి పండుని లేదా ఇతర ఫలాలను కూడా తీసుకోవచ్చు.  వ్యాయామ సమయంలో వేగవంతమైన చర్య కోసం గ్లూకోజ్ పానీయాలను కూడా తీసుకోవచ్చు. స్పోర్ట్స్ జెల్ అనేది మరొక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఇవి గ్లూకోజ్ ను అందించడమే కాకుండా ఎన్నో క్యాలరీలను కూడా అందిస్తాయి.

మీకు ఎంత గ్లూకోజ్ అవసరం?

మీ శరీరాన్ని, కండరాలను సమర్ధవంతమైన స్థితిలో ఉంచాలంటే వ్యాయామానికి ముందు కనీసం రెండు భోజనాలు చేసి ఉండాలి. స్త్రీలు  ప్రతీ భోజనంలో 25 నుండి 35 గ్రాముల కర్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. అదే పురుషులు అయితే 35 నుండి 50 గ్రాములు ఉండేలా చూసుకోవాలి.  ఉదయకాలంలో తీసుకునే ఆహారం ఎక్కువ సమయం నిలిచి ఉండి నెమ్మదిగా శక్తిని విడుదల చేయడానికి తప్పనిసరిగా క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేయబడుతుంది.  గ్లూకోజ్ మరియు తక్కువ మొత్తంలో కేలరీలను కలిగిన సాధారణ కార్బోహైడ్రేట్లను వ్యాయామానికి ఒక గంట ముందు తీసుకోవాలి. మీరు ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే శక్తిని కోల్పోతున్నప్పుడు తీసుకునే కేలరీలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.  సరైన కేలరీలను తీసుకోవడం వలన మీ బరువుని ప్రతీ రోజు కోరుకున్నట్లు తగ్గగలుగుతారు. మరో వైపు మీరు బరువు పెరగాలనుకున్నప్పుడు మీరు కరిగించిన కేలరీలను కంటే 30% నుండి 40% ఎక్కువ తీసుకోవాలి.