చాయ్ చటుక్కునా తాగరా.. భాయ్..!

ఈ చాయ్ చటుక్కునా తాగారా భాయి.. ఈ చాయ్ చమ్మాక్కులే చూడరా భాయ్.. అని ఓ కవి అన్నారు. ఇది నూటికి నూరు పాళ్ళు నిజమనే చెప్పాలి.టీ అంటే అంత పిచ్చ ప్రేమికులు కూడా ఉంటారు. మరికొందరైతే కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు రెండు మూడు సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. టీ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని అనేకమంది భావిస్తున్నారు.

ఇతర కార్బొనేటెడ్ పానియాలకంటే టీ ఆరోగ్యకరం. మీకు కావల్సిన రుచులలో , వివిధ రకాల ఫ్లేవర్స్ లో టీ తయారు చేసుకొని త్రాగవచ్చు . ఉదా: హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు.

1. ఒక కప్ప టీ త్రాగడం వల్ల మీ శరీరం ఉత్తేజం పరుస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అందుకు కారణం ఇందులో ఉండే కెఫిన్. అయితే కెఫిన్ కాఫీలో కంటే టీలో తక్కువ. అయితే కూడా ఇది మన శరీరం మీద సున్నిత ప్రభావాన్ని చూపెడుతుంది.

2. కాఫీ కాకుండా, టీ త్రాగడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కాఫీలోని కెఫిన్ మీ ఎముకల్లోని క్యాల్షియం బయటకు పంపించేస్తుంది. దాంతో బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అయితే కొన్ని పరిశోధన ప్రకారం చాలా సంవత్సరాల నుండి రెగ్యులర్ గా టీ త్రాగడం వల్ల వారికి ఎముకలు చాలా బలంగా ఉంటాయని కనుగొనబడింది.

3. టీ త్రాగడం వల్ల స్ట్రోక్ కలిగించే ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. టీ త్రాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు సాగే గుణం కలిగి ఉంటుంది మరియు రక్త కణాల్లో క్రొవ్వు కణాలు లేకుండా చేస్తుంది. టీ త్రాగడం వల్ల గుండె మరియు రక్తనాళాల సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది.

4. టీ, ముఖ్యంగా గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నివారిస్తుందని కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి.

5. టీ, లోని టానిన్లు మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది . దంత సమస్యలను నిరోధించుకోవాలంటే..జస్ట్ మీరు త్రాగే టీలో ఎక్కువగా పంచదార కలుపుకోకండి. మీరు తీసుకొనే టీలో ఒక్క స్పూన్ కంటే ఎక్కువ పంచదార లేకుండా చూసుకోవాలి. నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.

6. టీ రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో నీరు(తేమ)సమతౌల్యానికి కొనసాగించడానికి సహాయపడుతుంది. మీకు కావల్సిన హైడ్రేషన్ ను అంధిస్తుంది.

7. టీ వల్ల శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందించదు. మీరు తీసుకొనే టీలో అధికంగా పాలు కానీ, పంచదార కానీ కలుపుకోకూడదు. దాంతో మీ శరీరానికి క్యాలరీలు అందించదు. అదే సమయంలో, మీకు కావల్సిన విటమిన్స్ మరియు మైక్రో ఎలిమెంట్స్ ను అందిస్తుంది.

8. టీ కూడీ మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీతీసుకోవడం వల్ల కేలరీలను(అధిక క్రొవ్వు) కరిగించడానికి సహాపడుతుంది. కాబట్టి మీరు తీసుకొనే గ్రీన్ టీలో తక్కువ పంచదార వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది . ఇది శరీరంలోని ఆక్సీకరణ ప్రక్రియ నియంత్రణ మరియు ప్రారంభ వృద్ధాప్యం నిరోధించడానికి సహాయపడుతుంది.

10.స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌ టీ కాని, లెమన్‌ టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.

11.గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.

12. శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.