ఆరోగ్యానికి ఆపిల్

ఆ పండు రంగు చూసినా.. రుచి చూసినా.. ఎవరూ మళ్ళీ వదలరు. రోజూ తిన్నాగాని దానిపై జిహ్వకు మోజు తగ్గదు. ఏ వయసు వారైనా ఈ పండును తినటానికి చాలా ఇష్టపడతారు. ఆ పండే ఆపిల్. ఈ పండు విసేషాలను పత్యేకంగా ఈ శీర్షికలో మా పాఠకులకందిస్తున్నాం. ఈ ఆపిల్ పండు ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందామా!

1. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.

2. యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.

3. యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

4. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

5. ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు. జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం.

6. గుండె స్పందనలను క్రమబద్ధీకరించటంకోసం డిగాక్సిన్ వాడే వారు యాపిల్స్‌ని తీసుకోకపోవటం మంచిది. యాపిల్స్‌లోని పెక్టిన్ పదార్థాలను డిగాక్సిన్‌ని బంధించి శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి.

7. యాపిల్ గింజల్లో ఎమిగ్డాలిన్ అనే సయనైడ్‌ని పోలిన విష పదార్థం ఉంటుంది. పిల్లలు కావాలని గాని లేదా అనుకోకుండా గాని యాపిల్ గింజలను అధిక మొత్తాల్లో తింటే ప్రాణప్రమాదం జరుగుతుంది.

8. యాపిల్‌ని ఉడికించి గాని లేదా బేక్ చేసి గాని తినకూడదు. యాపిల్‌లో సహజంగా ఉండే విటమిన్-సి వేడి చేయటం ద్వారా నిర్వీర్యమవుతుంది. యాంటీ ప్లాట్యులెంట్ డైట్, లోఫైబర్ డైట్ తీసుకునేవారు యాపిల్స్‌ని వాడకూడదు.

9. ఆపిల్ రెడ్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని నిపుణులంటున్నారు. ‘ట్రిటర్‌పెనాయిడ్స్‌’గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర.

10.ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం)గా పని చేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల “విటమిన్ సి” ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం.

11.ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి.

ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం), జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి.

12.పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు)లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.

ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.

13.ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.