గుడ్డుతో ప్రయోజనాలు

శరీరానికి ఆరోగ్యం కలిగించే వాటిలో మొదటిది పాలు అయితే రెండవది గుడ్డు. ఇది రోజుకొకటి తీసుకోమని చెబుతుంటారు డాక్టర్లు. అయితే గుడ్డు వల్ల కలిగే విశేషమైన ప్రయోజనాలు శరీరానికే కాదు బాహ్య శరీరానికి ఎన్నో ఉన్నాయి. గుడ్డు అనేకమైన విషయాలలో అంతే మన అందాన్ని కూడా ఇనుమడించేదుకు సహకరిస్తుంది కూడా.. గుడ్డు చేసె మేళ్ళేంటో తెలుసుకుందామా..!

గుడ్డు తింటే ఆరోగ్యం అని తెలుసు . అయితే అందానికి కూడా అంతే మేలు చేస్తుందని చాలామందికి తెలియదు . అందుకే కొన్ని టిప్స్ మీకోసం

1. రెండు టీ స్పూన్ల గుడ్డు సోనలో ఒక స్పూన్ ఆలీవ్ ఆయిల్ , ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకోవాలి . పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి . దీని వల్ల చర్మం మత్తగా  తయారవుతుంది . కాంతివంతంగా కూడా ఉంటుంది .

2. చేతులకు వాక్సింగ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూను గుడ్డు సోనలో ఒక టీ స్పూన్ తేనె కలిపి చేతులకు  రాసుకోవాలి . ఓ పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి . దీనివల్ల చర్మం పైన ఉన్న బ్లాక్ హెడ్స్ మాయమవుతాయి .

3. జుట్టు మెత్తగా ఉండటానికి కూడా గుడ్డు సోన బాగా ఉపయోగపడుతుంది . హెన్న లో గుడ్డు సోన కలిపి పట్టుకుంటే జుట్టుకి మంచి కండీషనర్ గా ఉంటుంది .

 

NO COMMENTS