“తేనె” చేసే అద్భుతాలు

Honey beauty and health benefits

మీకు మూత్రం పదే పదే వస్తుందా…?? ఆఫీస్‌లో ఈ సమస్యతో మూత్రానికి వెళ్ళడానికి ఇబ్బంది పదుతున్నారా…??
వర్షాకాలం వస్తే మరింత సతమవుతున్నారా….?? అయితే మీ ఇంట్లోనే, మీకు అందుబాటులోనే ఔషధం ఉంది… అదే “తేనె”…. అతిమూత్రవ్యాధికే కాదు… ఆరోగ్యానికి ఏ రకంగా తేనె మేలు చేస్తుందో తెలుసుకుందామా!!
అతి మూత్రవ్యాధితో బాధపడేవారు రోజూ రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళే బాధ తగ్గుతుంది..

1. పెరిగే పిల్లలకు తేనె ఎన్నోరకాలుగా మేలు చేస్తుంది. పోషకాహారంగా పిల్లలకు  తేనె ఎంతో మేలు చేస్తుంది.

2. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.

3. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

4. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు.

5. తేనె పుచ్చుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.

6. తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు.

Subscribe to Blog via Email

Join 9,495 other subscribers

7. తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.

8. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది. తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మలబద్దకాన్ని నివారిస్తుంది. పంచదారకు బదులుగా తేనెను వాడటం అన్నివిధాలా ఉపయోగకరం. జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. భోజనానంతరం తేనె తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది.

9. రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం.
తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్‌ సర్క్యులేషన్‌ని క్రమబద్దీకరిస్తుంది.

10. అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు. కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్‌ను నివారిస్తుంది.

11. నోటి పూత, నోటిలో గుల్లలు వంటి సమస్యల నివారణకు తేనె వాడొచ్చు.

12.  ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్‌ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ.

ఇంతేకాక  ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధుల బారినపడకుండా కాపాడుతుంది “తేనె”