మీ చర్మ సౌందర్య సం రక్షణలో-పన్నీరు (rosewater) ఎలా ఉపయోగపడుతుంది.

స్త్రీలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఇప్పుడు ఎన్నో రకముల, చర్మ సౌందర్యాన్ని రక్షించే వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. కాని తర తరాలుగా, స్త్రీ యొక్క సౌందర్య సం రక్షణలో పన్నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ పన్నీరు, మరియు “రోజ్ ఆయిల్ ” మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని, చర్మ వ్యాధులు నుంచి కాపడుకోవచ్చు.

Sleeveless Blouse designs

ఒకప్పటి కాలంలో పన్నీరుని ఎక్కువగా అన్నింటిలో ఉపయొగించేవారు, కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఉత్పత్తులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు.

మీ చర్మం పై పన్నీరు చేసే అద్భుతాలు తెలుసుకుందాం రండి:

1. ఈ పన్నీరు మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది, అంతే కాకుండా నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, మీ ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది .

2.మన ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. దీనిని మీరు మీ “ఫేష్యల్” తర్వాత ఉపయోగిస్తే మీ చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరొగ్యంగా ఉంచుతుంది, అంతే కాకుండా, దద్దుర్లూ, ఎర్రబడిన ప్రదేశాన్ని తగ్గించి, మంచి ప్రభావాన్ని  చూపిస్తుంది.

4. ఈ పన్నీరులోని సుగంధ పరిమళాలు మీ యొక్క మనసిక స్థితిని పెంచి, భావోద్వేగంతో కూడిన ఆలోచనలని తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. ఇది మీకు నిద్ర సరిగా పట్టడానికి మరియు లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Subscribe to Blog via Email

Join 9,403 other subscribers

5. చాల సులువైన, మార్గం ఏమిటంటే మీరు రాత్రి పూట నిదురించే ముందు ఇది రాసుకుని పడుకుంటే, మీ ముఖం లోని మలినాలను శుద్ది చేసి, మరుసటి రోజు ఎంతో కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.