వెరీ’ గుడ్డు ‘

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ లింగ భేధం లేకుండా తహ తహలాడిపోతుంటారు. అందులోనూ ఆడవారు ఇంకా ప్రత్యేక శ్రధ్ధను చూపిస్తారు. అయితే మన ఇంట్లోనే ఉందే గృహ చిట్కాలను పాటిస్తే మనకు సహజ సిధ్ధమైన అందం వస్తోంది. అవును ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. అది ఏదో కాదు కోడి గుడ్డు. కోడిగుడ్డు విశేష లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇది అహారపదార్ధంగ కాకుండా సౌదర్యన్ని ఇనుమడించేదిగా కూడా ఉపకరిస్తుందని నిపుణులంటున్నారు. కోడి గుడ్డ్లలోని “లూటిన్” మీ చర్మాన్ని “ఎలాస్టిక్” గా చేయడానికి, మరియు “హైడ్రేట్” చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ చర్మ కణాలని సుద్దిచేసి, మీ చర్మాన్ని గట్టిగా చేస్తాయి. అంతేకాకుండా మీ జుట్టుకి బలంతో పాటు , మెరుపుని ఇస్తాయి. వీటిలోని “ప్రొటీన్లు” మనలోని జుట్టు మరియు గోళ్ళు పెరుగుటలో ఎంతో సహాయ పడతాయి. మీరు అందమైన చర్మం, సహజమైన జుట్టు పొందాలంటే, మీరు రోజూ తినే ఆహారంలో కోడి గుడ్డుని కూడా కలిపి తీసుకోండి. మీ అందం పైన, మీ జుట్టు పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మీ సౌందయానికి కోడిగుడ్డు చేసే మీళ్ళేంటో తెలుసుకుందామా..!

1. ఒక గుడ్డు తీసుకుని,దానిలోని సోనని ముఖానికి పట్టించి అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, చర్మం గట్టిపడడమే కాకుండా, మంచి కాంతివంతముగా మెరుస్తుంది.

2. ఒక గుడ్డు తీసుకుని, దానిలోని పచ్చ సొన, తెల్ల సొన రెండింటిని వేరు చేసి,తెల్లసొనని ఒక గిన్నెలో బాగా కలిపి ముఖానికి పట్టించాలి, అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే అది మన చర్మ కణాలని గట్టి పరచడమే కాకుండా, మొటిమలును తగ్గించేందుకు సహాయపడుతుంది.

3. మీరు మీ కంటి కింద చర్మం వాపుతోటి బాధపడుతున్నారా,ఎంతో అలసటగా అనిపిస్తుందా అయితే ఒక గుడ్డు తీసుకుని, దానిలోని తెల్ల సొనని ఆ వాచిన ప్రదేశం పై రాసి ఒక 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రపరుచుకుంటే, ఆ వాపులు తగ్గి మంచి సత్ఫలితాన్నిస్తుంది.

4. గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని,కొంచెం కొబ్బరి నూనె కలిపి ,బాగా మిక్స్ చేసి మీ ముఖానికి , మెడకి పట్టించాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి, ఇలా చేస్తే మీ చర్మము జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుంది, ఈ పద్దతి మీ జిడ్డుని పొగొట్టుకోవడానికి ఎంతో సులభమైనది.

5. గుడ్డులోని పచ్చ సొన తీసి, కొంచెం నిమ్మ రసం,కొంచెం పచ్చి ఆలివ్ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ పొడి చర్మం ఎంతో అందంగా మారుతుంది, ఈ పద్దతి పొడి చర్మంతో బాదపడే వారికి ఎంతో ఉపయోగకరం.

6. గుడ్డు,ఒక స్పూన్ తేనే, కొంచెం ఆలీవ్ నూనే, 2 స్పూన్లు రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి,20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మృదువైన, ఎంతో కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయి.

7. గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనే, పెరుగు కలిపి మీ ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

8. గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, నల్ల మచ్చలు పోయి, మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

9. ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ పచ్చి ఆలీవ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

10.కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేయాలి,ఈ పద్దతి వల్ల మీ జుట్టు బాగ పెరగడమే కాకుండా, ఎంతో మృదువుగా కూడా అవుతుంది.