‘బాదం’ తో ‘అందం’

నేటి పరుగుల ప్రపంచంలో ఏ పని చేయాలన్న సమయం కేటాయిచాల్సి వస్తోంది. ఒకవేళ సమయం కేటాయిద్దమనుకున్నా చాలా అతి కష్టం మీద సమయం దొరుకుతుంది. ఇలాంటప్పుడు మానసిక ఒత్తిడి , వాతావరణ ప్రభావం , తీసుకునే ఆహారం చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి . అలా మన చర్మం ఇబ్బందులకు లోనుకాకుండా ఉండాలంటే చాల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరి. బాదం నూనెతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ చిన్న చిన్న చిట్కాలేంతో చూద్దామా..!

1. ఆల్మండ్ బాదం నూనెతో రోజూ ఉదయం ఓ పది నిమిషాలు మర్దనా చేసుకుంటే ముఖంపై నలుపు ,ఎరుపు మచ్చలు , మొటిమల సమస్యలు తగ్గుతాయి.

2. కళ్ల కింద ఉబ్బు తగ్గాలంటే బాదం నూనెను వేళ్లతో తీసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుంటే ఉబ్బుతో పాటు నల్లని వలయాలు కూడా తగ్గుతాయి.

3. ఎండకు ఎక్సపోజ్ అయ్యే భాగంలో చర్మం కమిలినట్లుగా తయారవుతుంది . కొందరికి దురదలు కూడా వస్తుంటాయి ఇలాంటి వారు రాత్రి పడుకునే ముందు నూనెతో ఓ పది పదిహేను నిమిషాలు మసాజ్ చేసుకుని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి .దీనివల్ల చర్మ సమస్యలు తగ్గటమే కాకుండా మృదువుగా , కాంతిమంతంగా తయారవుతుంది .

4. నానబెట్టిన బాదంలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పచ్చి పాలను కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని పది పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి .పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ మంచి ఫలితానిస్తుంది .

5. బాదంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఇ ఉంటుంది . ఇది చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతుంది .గుండెకు బలాన్నిస్తుంది .రోజూ 4 బాదం పప్పులు తినడం అన్ని విధాల శ్రేయస్కరం .