నయన ‘సౌందర్యం’

tips-to-get-beautiful-eyes

ప్రతివారి ముఖం ఆకర్షణీయంగా కనపడాలంటే వారి కళ్ళు బాగుండాలి. వారి కళ్ళను బట్టే వారి అందం ఇనుమడిస్తుంది. జీవం లేకుండా మారే కళ్ళు ఉంటే వారి ముఖం చాలా జీవరహైతంగా ఉండటం సహజమే. అయితే కళ్ళను చక్కగా కాపాడుకుంటే అందం ఇనుమడిస్తుంది. అలా చాలా మంది కళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఏమేమి వాడాలో ఎలా వాడాలో తెలియక సతమతమవుతుంటారు. వారి కోసం మేమందిస్తున్నాం గృహ చిట్కాల్ని:

మన తెలుగు కవులు కళ్ళను ఎన్నో ప్రకృతి సౌందర్యాలతో పోలుస్తుంటారు. అయితే వారు అలా పోల్చటానికి కారణం ఎంతో ఉంది. కళ్ళు అందంగా ఉంటే ఆ ఆకర్షణే వేరు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుందట.. ఇదీ మన కవులే చెబుతున్నారు.

1. కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీం పడితే ఆ క్రిం రాయటం మంచిది కాదు. ఇలా చేస్తే మీ కళ్ళు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. అదీకాక మన కళ్ళకు పడే క్రీములు కాకపోతే కళ్ళు పోయే ప్రమాదమూ ఉంది. అందుకే వైద్యుని సలహాతోనే వాడాలి.

2. అర టీస్పూన్  కీరా రసం లో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షిణీయంగా ఉంటాయి.

3. కళ్ళకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.

4. గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈమిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజా మెరుస్తాయి . ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.

5. కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో  కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతలునుండి విముక్తి పొందవచ్చు .

6. నిద్రలేమి,అలసట , ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి కొందరికి.ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి.పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచేస్తుంది.