చలి నుంచి పరిరక్షించే పదార్ధాలు

గజ గజలాడించే చలిపులి ఇప్పటికే మనమీద దాడి చేస్తోంది. ఈ చలిలో వెచ్చవెచ్చగా ఉండేవాటిల్నే ఇష్టపడతారు అందరూ. అంతేకాక బాహ్య శరీరానికి ఏదో ఒక రకంగా వెచగా వెచ్చదనాన్ని ఇస్తాం. కానీ అంతర్శరీరానికి కూడా వెచ్చదనాన్ని ఇవ్వటానికి మనం ఎంతో ప్రయత్నిస్థాం. అందుకే ఓ చాయ్, ఓ కాఫీ తాగటానికి ఇస్టపడతాం. కాని ఇలా వేడి వస్తువులను తీసుకోవాలనే చూస్తే అనారోగ్యం పాలుకాక తప్పదు. అందుకే చలికాలంలో వాడాల్సిన పదార్ధాలను మీకందిస్తున్నాం. అవెంతో చూద్దామా!

1. జొన్నలను కనీసం వారంలో ఒక్కరోజైనా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల కండరాల కదలిక చక్కగా ఉంటుంది. నొప్పులు కూడా దూరంగా ఉంటాయి. జొన్నతో చేసే పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు దూరంగా ఉంటాయి.

2. చిలకడ దుంపలు చక్కటి పోషకాహారం. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. ఈ దుంపలో పీచు, కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ ‘ఎ’, ‘సి’ ఖనిజలవణాలు, మాంగనీసు, రాగి అధికంగా లభిస్తాయి. వీటిని ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తరచూ తీసుకుంటే ఈ కాలంలో ఎదురయ్యే అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు.

3. దానిమ్మ రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు, ఫాస్పరస్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని మరింత వృద్ధి చేస్తుంది. అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది. హృద్రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది.

4. పాలకూర ఆకుపచ్చని కాయగూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.. ఈ కూరలో ఇంకా ఇనుము, క్యాల్షియం, సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిరోజూ పాలకూరను ఉడికించి గానీ, సూపు, రసం రూపంలో తీసుకొనే అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

5. నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే వేడిని అందిస్తాయి. వీటిలో క్యాల్షియం, ఖనిజలవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం, రాగి సమృద్ధిగా లభిస్తాయి. నువ్వులతో తయారు చేసిన పదార్థాలను భోజనం తరవాత తీసుకుంటే అరుగుదల బాగుంటుంది. ఇవి చర్మానికి తేమను అందించడానికి తోడ్పడతాయి.

6. వేరుసెనగ గింజల్లో విటమిన్‌ ‘ఇ’, ‘బి3′ లభిస్తుంది. అలానే గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మంచిది. వేరుసెనగ గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అవి చర్మంలో తేమ శాతాన్ని పెంచుతాయి.

NO COMMENTS