పాదాల పగుళ్ళకు చిట్కాలు

చలికాలం కాస్త గిలి..గిలిగా ఉన్నా.. ఎన్నో చర్మ సమస్యలనే కలిగిస్తుంది. ఈ కాలంలో చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం ఓ సమస్య. పాదాలు పగలటమేంటీ ఇది ఒక్క ఆడవారి సమస్య అని అనుకుంటున్నారా? కానేకాదు. ఈ సమస్య ఈ కాలంలో అందరినీ పట్టి పీడిస్తుంది.

చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి… ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దామా..

1. ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.

2. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.

3. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

4. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.

5. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.

Subscribe to Blog via Email

Join 9,491 other subscribers

6. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.

7. చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు.

8. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.

9. ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోవటం అంత మంచిది కాదు.