సహజంగా మొటిమలను తొలగించడానికి ఇంటి చిట్కాలు – Telugu tips to remove pimples

మొటిమలు చాలా మందికి ఒక సాధారణ సమస్య. ఇవి సహజంగా జిడ్డు చర్మం కలిగిన వాళ్లని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కొంత మంది సాధారణ చర్మ స్వరూపాన్ని కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు తీవ్రమైన మొటిమల సమస్యను కలిగి ఉంటారు. ఇది కౌమార దశలోఇది కాస్త సహజమైన లక్షణమనే చెప్పాలి. అయితే ఈ దశ దాటి వచ్చినప్పటికీ మొటిమలు వాళ్ళ ముఖాల మీద మిగిలిపోతూ ఉంటాయి. దీనివల్ల  కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు తమ మొటిమలు చూపించడానికి సిగ్గుపడుతూ స్నేహితుల మధ్య గడపడానికి, నలుగురిలో కలవడానికి సంకోచిస్తూ ఉంటారు. క్రొవ్వు గ్రంధులు బాక్టీరియా బారినపడినప్పుడు చర్మం మీద మొటిమలు పుడతాయి. ఈ సమస్యకు మరొక ప్రాథమిక కారణం క్రొవ్వు గ్రంధుల చేత అదనపు శ్లేషపటలాల స్రావం అని చెప్పవచ్చు. ఇప్పుడు మొటిమలు కోసం కొన్ని సులభమైన గృహ చిట్కాలను మీరు ఇక్కడ తెలుసుకుంటారు.

మొటిమలకు కారణాలు

క్రొవ్వు గ్రంథులు స్రవించే అదనపు క్రొవ్వులు చర్మం మీద రంధ్రాలను మూసివేసి మొటిమలకు కారణం అవుతాయి. చనిపోయిన కణాలను శుభ్రం చేయనప్పుడు కూడా అవి చర్మ రంధ్రాల మీద పూడికలు ఏర్పరుస్తాయి. అంతేకాకుండా కౌమార దశలో ఉన్నవారి శారీరక మరియు హార్మోన్ల ప్రభావం క్రొవ్వు గ్రంధులను ఉత్తేజపరిచి అదనపు క్రొవ్వుల ఉత్పత్తికి దారితీస్తాయి. ఎవరైతే ఎక్కువగా టెస్టోస్టెరాన్  హార్మోన్ ఉత్పత్తిని కలిగి ఉంటారో వాళ్ళు క్రొవ్వు గ్రంథుల నుండి అదనపు కొవ్వుల స్రావాన్ని కలిగి ఉంటారు. కొన్ని పాల పదార్థాలు అధిక మోతాదులో కాల్షియం మరియు చక్కెర స్థాయిని కలిగి ఉండటం వలన అవి  కొంతమంది శరీరాలకి పడక మొటిమల అభివృద్ధిని ప్రేరేపించవచ్చు. రసాయన పదార్ధాలతో కూడిన సౌందర్య లేపనాలు ఉపయోగించి సరిగా శుభ్రం చేసుకోకపోవడం వలన అవి మొటిమలకు కారణం అవుతాయి.  అన్ని రకాల మేకప్ లేపనాలను తప్పనిసరిగా రాత్రి పడుకునే సమయంలో శుభ్రపరుచుకోవాలి.

మొటిమల్ని నివారించడానికి గృహ చిట్కాలు

ఐస్ ముక్క

Sleeveless Blouse designs

కొన్ని ఐస్ ముక్కలను ఒక కాటన్ వస్త్రంలో తీసుకుని మొటిమ ఉన్న చోట నెమ్మదిగా అద్దండి. ఇది మొటిమల బారిన పడిన ప్రదేశంలో రక్తప్రసరణని మెరుగుపరచడానికి మంచి ఉపకారిణిగా ఉంటుంది.

తేనె

తేనె మొటిమల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన వనరు. ఒక పత్తి బంతిని తేనెలో ముంచి మొటిమలు ఉన్న చోట రాసి ఒక అరగంట పాటూ ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

నిమ్మకాయ

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మొటిమల్ని త్వరగా తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికొరకు మీరు తాజా నిమ్మరసం మాత్రమే ఉపయోగించాలి. బాటిల్స్ లో లభించే కృత్రిమ నిమ్మరసం మీ చర్మానికి హాని కలిగించవచ్చు.

ఆవిరి పట్టడం

ముఖానికి ఆవిరి పట్టడం వలన మూసివేయబడిన రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది చర్మం మరింత మెరుగ్గా శ్వాశించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా చర్మానికి పట్టిన మురికి మరియు జిడ్డును తొలగించడానికి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందుకోసం ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీటిని బాగా మరిగించండి. ముఖానికి కాసేపు ఆవిరి పట్టి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. తరువాత మోయిశ్చరైజర్ ని రాసుకోండి. క్రమంగా దీనిని పాటించండి.

జిడ్డు ముఖంపై మొటిమలు నయం చేయడం ఎలా?

  • నల్ల మచ్చలతో కూడిన మొటిమలను నిమ్మరసం మరియు వేరుశనగ నూనెతో వాటి మీద రుద్దడం ద్వారా తొలగించవచ్చు.
  • వేపాకుల పొడి మరియు పసుపు మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వలన మొటిమల బాధ నుండి బయటపడవచ్చు.
  • వెల్లుల్లి రెబ్బలను చిదిమి మొటిమలు ఉన్న స్థలంలో వాటిని రుద్దడం అనేది మంచి పరిష్కారంగా పనిచేస్తుంది.
  • అదనపు నూనె మరియు దుమ్ముతో కూడిన చర్మం నుండి మొటిమలను తొలగించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. బేకింగ్ సోడా మరియు నిమ్మ రసాన్ని పేస్టులా చేసి మొటిమలకు రాసి రెండు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
  • ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో లేదా నిమ్మరసంలో కలిపిన తర్వాత మొటిమలపై వాడాలి. దీనిని ఒకటి లేదా రెండు సార్లు రాసిన తరువాత మొటిమలు మాయమవడం మీరు గమనించగలరు.
  • ఆవ నూనె మొటిమలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆవ నూనెలో చర్మానికి అవసరమయ్యే విటమిన్ సి, ఒమేగా 3 మరియు 6 కొవ్వు ఆమ్లాలు, సెలిసిలిక్ ఆసిడ్ మరియు జింక్ సంవృద్ధిగా ఉన్నాయి. వంటలలో ఉపయోగించే ఆవాల పొడి లేదా ఆవాల ముద్ద కూడా మొటిమలకు వాడవచ్చు. ఆవాల పొడిలో కాస్తంత తేనెని కలిపి మొటిమలకు రాయండి.
  • టమోటో గుజ్జుని రోజుకి రెండు మూడు సార్లు రాయడం ద్వారా మొటిమలకు స్వస్తి చెప్పవచ్చు.
  • సహజ సిద్ధమైన రోజ్ వాటర్ లేదా నిమ్మ రసంతో మొహాన్ని శుభ్రపరుచుకుని తర్వాత కాలమైన్ లోషన్ మొటిమలకు రాసుకోవడం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
  • ఆస్పిరిన్ టాబ్లెట్ మొటిమలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఆస్పిరిన్ టాబ్లెట్ ను చిదిమి ఆ పొడిని నీటిలో కలిపి ముద్దలా చేసుకుని మొటిమలకు రాసి రాత్రంతా వదిలేయండి.
  • కలబంద గుజ్జు మొటిమలను తొలగించడంలో ఉత్తమమైనదని చెప్పవచ్చు. దీనిలో ఉన్న శోథ నిరోధక మరియు ఆంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల నివారణకు సహకరిస్తాయి.

మొటిమల్ని తొలగించడానికి ఇంటి చిట్కాలు

తేనె మరియు దాల్చినచెక్క పొడి

సహజ పద్ధతిలో మీ మొహం మీద మొటిమల్ని తోలగించుకొనుటకు ఇంటి వద్దే తేనె మరియు దాల్చినచెక్క పొడి మిశ్రమాన్ని తయారుచేసుకోండి.  దాల్చినచెక్క పొడి బయట మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఒక చెంచా తేనెకు రెండు చెంచాల దాల్చినచెక్క పొడిని తీసుకుని వాటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న దగ్గర రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోండి. తరువాత నీటితో కడిగేయండి.

గుడ్డులో తెల్ల సొన

గుడ్డులోని తెల్ల సొనతో మొటిమలు నివారించుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక పచ్చి గుడ్డుని పగలగొట్టి అందులోని తెల్ల సొనని తీసుకోవాలి. ఇప్పుడు దానిని నురగలా వచ్చే వరకూ బాగా గిలక్కొట్టి మొహానికి రాసుకోండి. అది ఆరిన తరువాత మరలా అలానే రెండు మూడు సార్లు మొహానికి రాసుకోండి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో మొహం కడుక్కోండి.

Subscribe to Blog via Email

Join 9,405 other subscribers

ముగ్గిన బొప్పాయిపండు

మీ మొహం మీద మొటిమలు ఎక్కువగా ఉంటే, ముగ్గిన బొప్పాయిపండు వాటిని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న ముగ్గిన బొప్పాయిపండు ముక్కని తీసుకుని గుజ్జులా తయారు చేయండి. మొహాన్ని బాగా శుభ్రం చేసుకుని ఆపై ఆ గుజ్జుని మొటిమలకి పట్టించండి. 20 నిమిషాల పాటు ఉంచి మంచి నీటితో కడిగేయండి. ఆరిన తరువాత మొహం పొడిబారకుండా మోయిశ్చరైజర్ రాసుకోండి.

టీ ట్రీ నూనె

టీ  ట్రీ నూనె అందానికే కాకుండా ఆరోగ్య అవసారాలకు కూడా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ తాజాగా తెలిసినది ఏమిటంటే అది మొటిమలను తొలిగించుటకు కూడా ఉపయోగపడుతుంది. చిన్న పత్తి బంతిని తీసుకుని టీ ట్రీ నూనెలో నానబెట్టి మొటిమలు ఉన్న చోట అద్దండి. రాత్రంతా అలానే వదిలేసి ఉదయాన్నే శుభ్రపరుచుకోండి.