అందమైన, మరియు మృదువైన జుట్టు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు,వాడవలసిన హెయిర్ కండీషనర్లు

natural hair conditioners

మనం మన జుట్టుని అందంగా,ఉంచడానికి, మరియూ ఆ అందాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూఉంటాం, మార్కెట్లో లభించే ఎన్నో హెయిర్ కండీషనర్లను ఉపయోగిస్తూ, ఎన్నో ఇబ్బందులు పడుతూఉంటాం, సరిగ్గా గమనిస్తే మన ఇంట్లోనే, మన వంట గదిలోనే మన జుట్టు సం రక్షణకై  ఎన్నో అద్భుతాలు చేయవచ్చు.

Sleeveless Blouse designs

ఈ పద్ధతి వల్ల  మన డబ్బు వృధా కాదు అలాగే ,మీ జుట్టుని హానికరమైన మరియు కఠినమైన రసాయన ఆధారిత   ఉత్పత్తుల  బారి నుండి రక్షించడమే కాకుండా మంచి సత్ఫలితాలను పొందవచ్చు  అనడంలో సందేహం లేదు. మీ జుట్టుకి సరియైన పద్దతులతో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి అందం, పొడవు, నాజూకుతనంతో పాటు, మంచి మెరుపు మరియు సిల్కీ హెయిర్ పొందవచ్చు.

మన ఇంట్లోనే సహజ పద్దతులతో తయారుచేసుకునే హెయిర్ కండీషనర్లు గురించి తెలుసుకుందామ

 

“తేనె” జుట్టు కండిషనర్:

కావలసినవి: కోడి గుడ్డు 1,1 స్పూన్ తేనే ,3-4 స్పూన్ కొబ్బరి నూనె.

ఫద్ధతి: పైన సూచించిన అన్ని పదార్థాలు ఒక గిన్నె లో కలపాలి, మెల్లగా మీ జుట్టుకి పట్టించి, 20-30 నిమిషాల తరువాత గోరు వెచ్చని  నీటితో శుబ్రంచేసుకోవాలి

“అవెకాడో పండు” బలమైన కండిషనర్:

కావలసినవి: 1\2 పండిన అవకాడో(గుజ్జు),1\2 స్పూన్ కొబ్బరి నూనె,3 Tbsp రోజ్మేరీ నూనె లేదా లావెండర్

ఫద్ధతి: పైన సూచించిన అన్ని పదార్థాలు ఒక గిన్నె లో కలపాలి, మెల్లగా మీ జుట్టుకి పట్టించి, 20 నిమిషాల తరువాత నీటితో శుబ్రంచేసుకోవాలి.

Subscribe to Blog via Email

Join 9,403 other subscribers

 

“పుదీనా” జుట్టు కండిషనర్:

కావలసినవి: 3 గ్లాసుల నీరు, ఒక చిన్న గిన్నె నిండా పుదీనా ఆకులు

ఫద్ధతి: ముందుగా ఒక గిన్నెలో 2-3 గ్లాసుల నీళ్ళు పోసి పుదీన ఆకులు వేసి మరిగించండి, తరువాత గిన్నెను చల్లార పెట్టండి.మీ షాంపూతో స్నానం చేసిన తరువాత ఈ చల్లారిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

 

అందమైన,మృదువైన, సిల్కీ జుట్టు కోసం “పాలు మరియు అరటి పండు” జుట్టు కండిషనర్:

కావలసినవి:

1 కప్పు పాలు,1 అరటి పండూ,1Tbsp కొబ్బరి నూనె.

పైన సూచించిన పదార్దాలలో పాలు, అరటి పండుని పేస్ట్ గా చేసి, కొంచెం కొబ్బరి నూనె కలిపి, మీ జుట్టుని తడి చేసుకుని మెల్లగా ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించండి, తరువాత ఒక కవరుతో జుట్టుని కప్పండి.30 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోండి.

ఇక్కడ గమనించవలసింది ఎమిటంటే ఈ పద్దతి తరువాత తప్పని సరిగా షాంపూతో శుబ్రం చేసుకోవాలి.

 

“DIY” జుట్టు కండిషనర్ :

కావలసినవి:2 కప్పుల నీరు ,ఆపిల్ పళ్లరసం, 1\2 కప్పు వినెగార్

ఈ పధార్దములు  అన్నీ కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి, 20-30 నిమిషాల తరువాత  మీ వేళ్ళతో జుట్టుని తడమండి, తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి అందమైన జుట్టు పొందడమే కాకుండా రసాయన రహితమైన స్వచ్చమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

 

ఇక ఎప్పుడైనా “కండిషనర్” కొనడానికి వళ్ళాలి అనుకున్నప్పుడు ఒకటి, రెండు సార్లు ఆలోచించండి, తెలిసి తెలిసీ మీ  డబ్బులు వృధా చేసుకుని మీ జుట్టును పాడుచేసుకునే  కన్నా ఈ పైన సూచించిన సహజ పద్దతులు పాటించడం  ద్వారా మీ జుట్టు పై మీకున్న ప్రేమను చూపించండి.