X
    Categories: ఫేస్ ప్యాక్స్సౌందర్యం

మీ అందమైన చర్మం కోసం బంగాళ దుంపలు చెప్పే చిట్కాలు

 

   బంగాళ దుంపలు చెప్పే చిట్కాలు

  • కొంచెం బంగాళాదుంప రసం మరియు నిమ్మరసం, సమానముగా తీసుకుని, దానిలో కొంచెం 1\2 Tbsp తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం మీ చర్మంలోని, జిడ్డు కణాలని, మరియు, జిడ్డు తనాన్ని  తరిమికొట్టి, మిల మిలా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.”జిడ్డు తనంతో బాధపడుతున్న వారు ఈ పద్దతి పాటిస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.
  • మీది పొడి చర్మమా, మృదువైన చర్మం కావాలంటే ఈ “ఫేస్ మాస్క్” ఎంతో ఉపయోగకరం: మీరు చేయవలసిందల్లా, 2 Tbsp పాల పౌడర్, 1 Tbsp బాదం నూనె, కొంచెం ఉడికించిన  గసికను కలిపి ముఖానికి పట్టించి 20-25 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మృదువైన, తేజోవంతముగా ప్రకాసించే చర్మం మీ సొంతం.
  • మరొక చిట్కా: మీ ఇంట్లోనే 1\8కప్ బంగాళదుంపల ముక్కలు,1\4కప్ దోసకాయ ముక్కలతో మంచి “ఫేస్ క్లీనర్” తయారుచేసుకోవచ్చు,వాటిపై తోలు తీయకుండా ఉపయోగించాలి.
  • ఒక కోడి గుడ్డు, 1\4కప్ పెరుగు, 1 Tbsp బేకింగ్ సోడాని చిన్న గిన్నెలో కలిపి ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేయాలి
  • మీరు యవ్వనంతో  అందంగా కనపడాలంటే: 1 బంగాళదుంప, 3 Tbsp “ఆపిల్ సాస్”ని తీసుకుని , ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే  తళ తళ లాడే యవ్వన సౌందర్యం మీ సొంతం .
  •  మీరు మోటిమలు లేదా నల్ల మచ్చలతో సతమతమవుతున్నరా ఈ చిట్కా మీకోసమే: కొంచెం బంగాళదుంప రసం, మరికొంచెం నిమ్మ రసం, కొంచెం బంక మట్టి, ఈ 3 కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుని “Moisturaizer” ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
  •  బంగాళదుంపల్ని ఫ్రిజ్ లొ పెట్టి 30 నిమిషాల తరువాత కళ్ళపై ఉంచుకుంటే మెత్తని, మరియు చల్లని ఉపసమనాన్ని పొందవచ్చు.
  • కళ్ళ దగ్గర నల్లని మచలు వేదిస్తున్నాయా , అయితె ఇలా చేయండి: బంగాళ దుంపని తొక్క తీసేసి ముక్కలుగా చేసి కళ్ళపై ఉంచుకోండి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోండి, బంగాళ దుంపలో ఉన్న “Catalase Enzyme” వల్ల  నల్లని మచ్చలు తొలగిపోయి అందమైన ఆక్రుతిని పొందుతారు
  •  బంగాళ దుంప రసాన్ని ముఖమునకు పట్టించి 15-20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, దీని వల్ల మన చర్మం పై ఉన్న మచ్చలు, ముడతలు,ఫొడితనం తొలగిపోయి, తేజోవంతమైన రూపం మీ సొంతం అవుతుంది.
  •  ఒక పచ్చి బంగాళదుంపని మీ ముఖం పై రుద్దండి, కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోండి,తెల్లని అందమైన మీ చర్మాన్ని చూసి ఆనందం పొందండి, అంతే కాకుండా మీ చర్మంలో ఉన్న ఉబ్బిన ప్రదేశాన్ని కరిగించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  •  ఉడక పెట్టిన బంగాళదుంప ముక్కల్ని ముఖం పై  పట్టుకుంటే, కాలిన మరియు వాపులు వంటి సమస్యలు ఉపశమనానికి సహాయపడుతుంది. మంట పుట్టించే రక్త కణాలను శాంత పరిచి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  • దురద పుట్టుట, దద్దుర్లు వచ్చుట, లేదా పురుగు\ దోమ కుట్టిన ప్రదేశాలలో పచ్చి బంగాళ దుంప ఉంచి, ఇలా రోజుకి  పలుసార్లు చేస్తే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  •  మీ జుట్టు వేగంగా మరియు ఎక్కువగా పెరగాలంటే కొంచెం బంగాళ దుంప రసంలో కలబంద, 1 Tbsp  తేనె  కలిపి మీ జుట్టుకి పట్టించి 1-2 గంటల తరువాత శుబ్రం చేయండి
విజయ్ :