X
    Categories: సౌందర్యంహెయిర్ కేర్

సహజ పద్దతులతో మీ తెల్ల జుట్టూ లేదా పొడిబారిన(నిరుత్సాహకరమైన) జుట్టుని వదిలించుకోవటం ఎలా??

మీరు అద్దంలో చుసుకునేటపుడు, మీ జుట్టు పొడిబారిపొయినట్లు అనిపించినా, లేక చిన్న వయసు లోనే మీ జుట్టు తెల్లగా మారినా మిమ్మల్ని ఎంతో బాధిస్తుంది, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా, చిన్నవారికి కూడా జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, పొడిబారిపోయి,బద్దలవడం జరుగుతుంది, అయితే మీ జుట్టు యొక్క అందాన్ని కాపాడుకోవడానికి, అందమైన, మరియు, మృదువైన జుట్టుని పొందడానికి, కొన్ని చిట్కాలు  తెలుసుకుందామా.

 సాధారణంగా మన జుట్టు వయస్సు పెరిగే కొద్దీ , రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అంతేకాకుండా, జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల సైతం ఈ ఇబ్బంది కలుగవచ్చు.అతి చిన్న వయస్సులోనే జుట్టు పొడిబారిపొవడం, పొట్లుగా మారిపోవడం ఎంతో బాదకలిగించే మరియూ ఇబ్బందిపెట్టే సమస్య, అయితే బాదపడకుండా, ఆలస్యం చెయకుండా ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందామా, మీరు చేయవలసిందల్లా

 

ఉసిరి(భారత దేశపు పండ్లలో ఉన్నతమైనది)

మన జుట్టుకి ఉసిరికాయ ప్రభావం ఎంతో మంచిది అని, ఎన్నో  తరాలనుంచి అందరికి తెలిసిన విషయమే.అయితే ఎండబెట్టిన ఉసిరి ముక్కలని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు మీ జుట్టుకి రాసుకుని తలస్నానం చేస్తే,ఎంతో మంచిది. మీ జుట్టు నున్నగా, లేదా మృదువుగా అవ్వాలంటే, ఉసిరి పేస్ట్ ని కాని, లేదా ఉసిరి ఆయిల్ ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది.

 

మెంతులు:

మన చర్మ సౌందర్యానికే కాదు, మన జుట్టు సం రక్షణలో కూడా మెంతులు ఎంతో ఉపయోగపడతాయి,

ఈ మెంతుపిండిని, రోజూ తలకు పట్టించుకుని తలస్నానం చేస్తే ఎంతో మృదువైన, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

 

నువ్వు గింజలు:

 కొంచెం బాధం నూనె తీసుకుని , దానిలో నువ్వులపొడి కలిపి, మీ జుట్టుకి పట్టించండి,20-25 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మీ జుట్టులో అద్భుతాలు చూడవచ్చు.

 

నెయ్యి\వెన్న:

మన పెద్దవాళ్ళు చెప్పినట్లు, నెయ్యి మన జుట్టు రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది,మెరిసే జుట్టు కోసం, వారానికి 2 సార్లు వెన్నని జుట్టుకి పట్టించి తలస్నానం చేస్తే, అందమైన జుట్టును పొందవచ్చు.

 

ఉల్లిపాయ:

అందమైన జుట్టు కోసం ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి పట్టించి, 30 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.

 

క్యారెట్:

ప్రతీ రోజు క్యారెట్ జూస్ తాగితే తెల్ల జుట్టును నివారిస్తుంది.

 

బ్లాక్ టీ:

పాలు, పంచదార లేని బ్లాక్ టీలో 1 స్పూన్ ఉప్పు కలిపి తలకు పట్టించి 1గంట తరువాత మామూలు నీటితో శుబ్రం చేసుకోండి మంచి ఫలితాలు పొందవచ్చు.

 

గోరింట:

మన అందరికి తెలిసిందే గోరింట మన జుట్టుని రక్షించడంలో ఎంతగా ఉపయోగపడుతుందో.ఇది సులభంగా దొరకడమే కాకుండా మంచి ఫలితాల్ని ఇస్తుంది.

 గోరింట పొడి (2 టేబుల్ స్పూన్లు), పెరుగు (1 టేబుల్ స్పూన్), మెంతులు (1 టేబుల్ స్పూన్), కాఫీ (3టేబుల్ స్పూన్లు), తులసి (2 టేబుల్ స్పూన్లు), మరియు పుదీనా రసం (3టేబుల్ స్పూన్లు) తీసుకోండి.బాగా కలిపి మీ జుట్టుకు పట్టించండి 2-3 గంటల తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

 

గోధుమ మొలకలు:

గోధుమ మొలకల జూస్ ని రోజూ తీసుకుంటే, మీ జుట్టుని కాపాడుకోవఛ్ఛు.

 

చివరిగా ఒక్క మాట,

నిస్సారమైన జుట్టుకు కారణం మన ఆరోగ్యం పట్ల అసమర్దతను తెలియ చేస్తుంది.,అందుకే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే,మీ జుట్టుని కాపాడుకున్నట్లే, 

మీరు అందంగా కనిపించాలన్నా, మృదువైన జుట్టు పొందాలన్నా ఈ పై సూచించినవన్నీ  పాటించండి.

 

విజయ్ :