యువత ఆరోగ్యంగా ఉండాలంటే?

మానవ జీవిత చక్రంలో అతి కీలకమైన వయస్సు యవ్వనం. అది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. నేటి యువత ఆరోగ్యం వారు తీసుకునే పౌష్టికాహారంలోనే ఉంటుంది. యవ్వనంలో ఉన్న స్త్రీ పురుషులిద్దరికీ ఈ ఆరోగ్య చిట్కాలను అందిస్తున్నాం. మరి ఆ పౌష్టికాహారం ఏమిటో తెలుసుకుందామా..

1. మొదట ఆరోగ్యం మీ చెంత చేరాలంటే మీ కడుపులో మలం ఉంటే మీరు ఎంత తిన్నా, మంచి పౌష్టికాహారం తీసుకున్నా ఏమాత్రం ఫలితం లేదంటున్నారు వైద్యులు. భోజనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి, దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి సరిగా లేకపోతే మందులు వాడాల్సివస్తుంది.

2. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒకస్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి.

3. పాల మీగడతోటి కలకండను కలుపుకుని తీసుకుంటే శరీరానికి మంచి బలాన్నిస్తుంది.

4. రెండు స్పూన్ల ఎర్రగడ్డ రసం, ఒక స్పూన్ తేనె, కాసింత నెయ్యి కలిపి తీసుకుంటే యోని శక్తి వృద్ధి చెందుతుంది.

5. చిలగ్గొట్టిన మజ్జిగ నుంచి వచ్చిన వెన్నతోబాటు కలకండ కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత నీటిని తాగకూడదు.

6. అరలీటరు పాలలో 50 గ్రాముల ఉద్దిపప్పు వేసి ఉడకబెట్టిం తర్వాత దానిని పాయసంలాగా త్రాగండి. దీనివలన శరీరానికి మంచి బలం చేకూరుతుంది.

7. 1/4 లీటరు పాలలో ఒక స్పూను అశ్వగంధ చూర్ణం, ఒక స్పూను కలకండ కలిపి ఉదయం..రాత్రిపూట తీసుకుంటే మార్పు కనపడుతుంది. ఇలా 40 రోజులు తీసుకోవాలి. ఈ పదార్థాం తీసుకున్నతర్వాత రాత్రి నోరు పుక్కలించి పడుకోవాలి.

8. ఉదయం పూట 1/4 లీటరు పాలతోబాటు రెండు..మూడు అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ముఖంపై కాంతి కూడా బాగా పెరుగుతుంది.

9. ఉదయంపూట 1/4 లీటరు చల్లటి పాలలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రక్త శాతం వృద్ధి చెందుతుంది.

10.ఉదయం..రాత్రి భోజనం తర్వాత ఆపిల్, దానిమ్మ, అరటి, లేక ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి.

11.బాదం పప్పును రాతిమీద అరగదీసి పాలల్లో కలుపుకుని తాగాలి. దీంతో అపారమైన శక్తి లభిస్తుంది.