జ్ఞాపకశక్తిని పెంచేందుకు చిట్కాలు

మీకు జ్ఞాపకశక్తి లేదా? మీ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకుంటున్నారా? అయితే మీరేం బధ పడాల్సిన అవసరం లేదు. ఎలాగని సంకోచిస్తున్నారా? అయితే మనకు నిత్యం లభించే కాయగూరల్లో కొన్నింటిని ఈ క్రింద సూచించిన ప్రకారం వాడితే జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

1. ఒక క్యారెట్టు, గోబిఆకులు 10 నుండి12 అంటే కనీసం 50-60 గ్రాములు, కొత్తిమిరి ఈ మూడు కోసి ప్లేట్‌లో ఉంచుకోండి, ఆపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ రసం కొద్దిగా కలిపిన తర్వాత ఉదయంపూట టిఫిన్‌గా తీసుకోండి.

2. భోజనంతో బాటే ఒక గ్లాసు మజ్జిగ తీసుకోండి. మజ్జిగ చాలా చలవని మన పెద్దవారంటారు. అవును అది నిజం. మజ్జిగలో అన్ని విశిష్ట గుణాలున్నాయి.

3. రాత్రి తొమ్మిది గంటల తర్వాత చదువుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతి అరగంటకొకసారి అరగ్లాసు నీరు త్రాగండి. మేల్కొనేటప్పుడు వచ్చే అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అది కూడా పదకొండు గంటల వరకే మంచిది. ఆ పైన మేల్కొంటే ప్రమాదమే అని విశ్లేషకులంటున్నారు.

4. చాలామంది చదువుకునేటప్పుడు బోర్లా పడుకుని లేదా వంగి కూర్చుని చదువుతుంటారు. అలా చదివితే చాలా ప్రమాదమే. నిటారుగా కూర్చుని చదవాలి. దీంతో చదవడానికి ఏకాగ్రత కుదురుతుంది.

5. చదివి చదివీ అలసిపోయినప్పుడు మీకు అలసట అనిపిస్తే కాస్త అటుఇటు పచార్లు చేస్తూ తిరగండి. నిద్ర పోగొట్టడానికి టీ, సిగరెట్లు తాగకండి. విద్యార్థులు గనక పై సూచనలు, చిట్కాలను సక్రమంగా పాటిస్తే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుందట.