ఒత్తిడి నుంచీ దూరంగా ఉండాలంటే?

నానాటికీ పెరిగిపోతున్న యాంత్రిక జీవన శైలి కారణంగా మనలో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. అయితే ఎంత ఒత్తిడి కలిగినా దాని నుండి బయట పడే మార్గాలైతే ఎవరూ ఆచరించలేకపోతున్నారు. ఏది ఎమైనా అల్టిమేట్ గా స్ట్రెస్స్ మన చెంతే ఉంటోంది. నాగరికత పెరిగే కొద్దీ జీవన శైలిలో మార్పుల కారణంగా ఒత్తిడి సాధారణమైపోయింది. వివిధ కారణాల రీత్యా ఏర్పడే మానసిక ఒత్తిడి నుంచీ బయట పడాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి. అవేంటో చూద్దామా..

1. ప్రకృతిని మనం ఎంజాయ్ చేస్తామే కానీ ప్రకృతి కాదు. ప్రకృతి ఒడిలో ఎంత సేపైన సేద తీరవచ్చు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు తోటపని చేయటం మంచిది. తోటపని మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రకృతికి చేరువైతే మీ మనస్సుకు విశ్రాంతి, ప్రశాంతత కలుగుతుంది. మాకు తోట లేదే అని యోచిస్తున్నారా..! అయితే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుని అక్కడ సీద తీరితే సరి. పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

2. ఈనాడు ఒత్తిడిని తగ్గించే మార్గాలలో ఒక ముఖ్య పాత్రను యోగా పోషిస్తోంది. ప్రశాంతకరమైన జీవనాన్ని అలవరచుకోవాలంటే యోగా చేస్తే చాలు. యోగా కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. యోగా ద్వారా శరీరంలోని కండరాలు సాగి, సడలింపు చెంది తద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

3. మనం ఎప్పుడైనా గమనిస్తే పుస్తకం చదివేప్పుడు మమకు తెలియకుండానే నిద్ర ముంచుకొస్తుంది. అంతే చదివేప్పుడు ఏకాగ్రత వల్ల మనం ఒత్తిడిని మరచిపోతాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు రీడింగ్ మీకెంతో సహకరిస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించండి. మంచి పుస్తకాలు చదవండి.

4. రుచికరమైన పదార్ధలు తినటం వల్ల మనకు జిహ్వ పై ఉన్న నరాలలో ఉత్తేజం ఏర్పడి తొందరగా ఫ్రెష్ అవుతాం. ఇందులో సందేహమే లేదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు వంట చేయండి. మీకు నచ్చిన వంటకాన్ని వెరైటీగా ట్రై చేయండి.

5. ఇక సంగీతం. సంగీతాన్ని వింటే రాళ్ళు సైతం నర్తిస్తాయంటారు. అందుకే మీకు నచ్చిన పాటలు వినండి. మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, తక్షణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.