శుక్లాలు అంటే? చికిత్స విధానం, ఆహార నియమాలు

శుక్లాలు అంటే?

కళ్ళు మనకు చాలా ప్రధానమైనవి. ఆ కళ్ళు అశ్రధకు గురైతే కలిగే పర్యవసానం శుక్లాలు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక వయసు దాటిన తరువాత చూపు మందగిస్తుంది. కంటిపై పొరలు ఏర్పడుతాయి. ఇది సర్వసాధారణం. శుక్లాలు అని సాధారణంగా పిలవబడే ఈ రోగాన్ని తిమిర రోగం, లింగనాశ రోగం అని కూడా అంటారు. ఒక వయస్సు దాటిన తరువాత ఇది మామూలేగా అని సరిపెట్టుకుంటే మరింత ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే వ్యాధి మరింతగా ముదిరితే శుక్లాలుగా మారే అవకాశం పుష్కలంగా ఉంది. దానికి ఆయుర్వేదం చాలా చికిత్సా విధానాలే ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అవేమిటో మనం తెలుసుకుందామా!

చికిత్స విధానం

1. సిద్ధ నాగార్జున వర్తి లేదా చంద్ర నాగార్జున వర్తిలను తేనెతో అరగదీసి రోజుకు మూడు మార్లు కంటిలో పెట్టాలి.

2. త్రిఫల కషాయముతో రోజూ కళ్ళను కడగ వలెను.

3. పడుకునే ముందు కప్పు పాలు తాగి పడుకోవాలి.

ఆహార నియమాలు

కళ్ళకు మచి చేసేవే తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల కళ్ళకు జాగ్రత్త తీసుకోవటం వల్ల మెరుగు పడతాయి. కళ్ళ ఆరోగ్యం కోసం ఆవునెయ్యి, పాలు, మజ్జిగ బాగా ఉపయోగించవచ్చును. పాత బియ్యుం, గోధుమ, అరటీ, మెంతీ, ములగ, బెండ కరివేపాకు వాడడం మంచిది.

పాటించవలసిన నియమాలు

1. వేడిగానీ, సూర్యరశ్మగానీ కళ్ళకు తగలడం అంత మంచిది కాదు.

2. మానసిక ఆందోళన, కోపం, శోకాల వలన నష్టం జరుగుతుంది. కాబట్టి వీలైనంతవరకూ ప్రశాంతంగా ఉండడం మంచిది.

3. వీలైనంతవరకూ కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం మంచిది.