చుండ్రు సమస్యకు గృహ చికిత్సలు – Dandruff solutions & treatments in Telugu

అన్ని వయసుల వారినీ పట్టిపీడిస్తూ అందరికీ శిరోభారాన్ని కలిగిస్తున్న సమస్య చుండ్రు.జుట్టు రాలిపోవటం,దురదకు గురిచేయటం,కుదుళ్ళను బలహీనపర్చటం లాంటి ఎన్నో సంస్యలకి చుండ్రు  తెరతీస్తుంది.అయితే ఈ సంస్యా తీరేందుకు ఎన్నో ట్రైకాలజీ సంస్థలు,మరెన్నో బ్యూటీ పార్లర్లు రకరకాల థెరపీలంటూ వచినా ఈ స్పీడ్ లైఫ్ లో దీనిని అధిగమించటం కుదరటంలేదు.అయితే ఈ థెరపీలకు పెట్టే ఖర్చు అంతా ఇంతా కాదు.ఇందుకోసం గృహ చికిత్సలను మా పాటకులకోసం ఇవ్వలని కొన్ని మీకోసం అందిస్తున్నాం. 
 1. ఎండిన నారిజపండు తొక్కలు,ఉసిరికాయ పెచ్చులు,కుంకుడు,శీకాకాయలను సమంగా కలిపి నీళ్ళకు చేర్చి మరగించి తలస్నానం కోసం వాడాలి.దీనికి ముందు పుల్లని మజ్జిగను తలకు పట్టించాలి.
 2. కొబ్బరినూనెకు నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ళకు పట్టించి గంట తర్వాత శీకాయ కషాయంతో తలస్నానం చేస్తే చుంద్రు తగ్గుతుంది.
 3. గసగసాల గింజలను పాలతో సహా పేస్టు మాదిరిగా మెత్తగా నూరి తలకు పట్టించి అరగంట తరువాత శుభ్రపరచుకోవాలి.
 4. చందనం(మంచిగంధం) తైలం 1 భాగం,నిమ్మరసం3 భగాలు కలిపి జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
 5. మినుములను జిల్లేడు పాలతో కలిపి ఎండబెట్టి పొడిచేసి నిల్వ ఉంచుకోవాలి.దీనిని తగినంత తీసుకుని ఆవనూనెతో కలిపి తలకు పట్టిచి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
 6. మామిడి టెంకలోని జీడిని సేకరించి సమానంగా కరక్కాయ పెచ్చులకు కలిపి పాలతో సహా మెత్తగా నూరి తలకు లేపనం చెసి,గంట తర్వాత తలస్నానం చేయాలి.
 7. వేపనూనెను,కానుగనూనెను సమాన భాగాలుగా కలిపి కొద్దిగా కర్పూరం చేర్చి తలకు రాసుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి.
 8. పారిజాతం గింజలను సేకరించి ముద్దుగా నూరి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.
 9. మెంతుల గింజలను మెత్తగా నూరి పెరుగును కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.
 10. వాకుడు కాయలతో తైలం తయారు చేసుకుని తలకు ప్రయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.ముందుగా వాకుడు కాయలను ముద్దగ నూరాలి.దీనికి 4 రెట్లు నువ్వుల నూనెను 16 రెట్లు నీళ్ళను చేర్చి ద్రవాంశం మొత్తం మీద ఆవిరయ్యేంతవరకూ చిన్న మంట మీద మరగించాలి.తరువాత వడబోసి శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.దీనిని తలస్నానానికి ముందు జుట్టు కుదుల్లకు ప్రయోగించాలి.
 11. మందారపువ్వులను నూరి తైలం చేసుకుని వాడితే చుండ్రు చాల వరకు తగ్గే అవకాశముంది.
 12. కుంకుడుకాయి,షీకాయి,త్రిఫలాలు ఇవన్నీ చుండ్రులో బాగ పనిచేస్తాయి.వీటిని విడివిడిగా కాని,ప్రత్యేకంగా గాని, షాంపూగా వాడుకోవాలి.