చుండ్రు నివారణ, మరియు అందమైన జుట్టు కోసం అనువైన పద్దతులు

remove dandruff

చుండ్రు, ఎంతోమందిని ఆందోళనకు గురిచేస్తూ వారి యొక్క ఆత్మ విశ్వాసాన్ని కొల్పోయేల చేసి, జుట్టుని పొడిగా, చిన్న చిన్న పొరలుగా చేసి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే  భయపడకుండా, దీని నిర్మూలనకు ఇంట్లోనే తయారు చేసుకునే తేలికైనె, అనువైన పద్దతులు తెలుసుకుందామ:

మెంతులుతో చికిత్స:

Sleeveless Blouse designs

2స్పూన్లు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వాటిని పిండిగా చేసి మీ తలకు పట్టించుకుని 15-20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, ఆ నానబెట్టిన నీటిని పారవేయకుండా, స్నానం తరువాత మీ జుట్టుని ఈ నీటితో శుబ్రం చేసుకోవాలి,ఇలా ఒక వారం చేస్తే మంచి మార్పు వస్తుంది.

 

నిమ్మతో చికిత్స  :

3 స్పూన్లు నిమ్మరసం +1 కప్పు ముల్తాని మట్టీ తీసుకుని కొంచెం నీటిలో కలిపి జుట్టుకి పట్టించాలి,ఇలా వారం పాటూ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

 

పళ్ళరసంతో కూడిన వెనిగర్ మిశ్రమము:

3 స్పూన్లు  పళ్ళరసంతో కూడిన వెనిగర్, 3 స్పూన్లు నీరు కలిపి దూదెతో మీ జుట్టుకి పట్టించి శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు

 

Subscribe to Blog via Email

Join 9,403 other subscribers

అలొవేరా(కలబంద):

మీరు తలస్నానం చేసే ముందు, మీ జుట్టుకి కొంచెం కలబంద జల్ ని పట్టిస్తే చుండ్రుకి మంచి చికిత్సలా పనిచేస్తుంది.

 

వెనెగర్:

కొంచెం వెనెగర్ ని, నీటిని సమానంగా కలిపి మీ జుట్టుకి పట్టించి మరుసటి రోజు తల స్నానం చేస్తే చుండ్రు నుంచి మంచి మార్పు లబించవచ్చు.

 

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ మీ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రునీ తొలగించుటలో ఎంతో ఉపయోగపడుతుంది.దీనిని మీ జుట్టుకి పట్టించి మసాజ్ చేయాలి, తరువాత మీ జుట్టుని ఒక టవల్ తో చుట్టుకోవాలి,అరగంట తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

 

పెరుగు చికిత్స:

2-4 రోజుల ముందు పెరుగు తీసుకుని మీ తలకు పట్టించి 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.