యుక్తవయస్సు రాకపోతే?

కొందరు 20 ఏళ్ళకే పుడుతుంటారు..కొందరు 60 ఏళ్ళైనా అప్పుడే పుట్టరు అని ఓ కవి అన్నాడు అంటే ఆ మాటకి అర్థం ఇంకా వారిలో మెక్చ్యూరిటీ రాలేదని అర్థం. ఆడ, మగ తేడాలు లేకుండా ఈ సమస్య అందరినీ బాధిస్తుంది. అయితే తల్లిదండ్రులకు మాత్ర్మ ఇది పెను సమస్యగా ఉంటుంది. పిల్లల్లో నెలకొనే ఈ సమస్యలను ఈ సీర్షికలొ ఇస్తున్నాం. అవెంటో చూద్దామా!

పిల్లలకు యువక్త వయసు రాగానే తల్లిదండ్రులలో అందోళన మొదలవుతుంది. ఎక్కడ పెడదారి పడతారోనని భయపడుతుంటారు. ఇది దాదాపుగా అందరు తల్లిదండ్రులలోనూ ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా కొంత తల్లిదండ్రలలో పిల్లలకు యుక్తవయసు రాక ఆందోళన చెందుతుంటారు. తమ అమ్మాయి పెద్దపిల్ల కాలేదనో లేక తమ అబ్బాయికింకా పిల్లమనస్తత్వం పోలేదనో వారు భయపడుతుంటారు. వారి ఆందోళన సరీనదే. ఏ వయసులో జరగాల్సిన పరిణామాలు ఆ వయసులో జరిగిపోవాలి.లేదంటే కొన్ని సందర్భాలలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

కొందరు అమ్మాయిలు ఎంతకాలం చూసినా అదే విధంగా ఉంటారు. వయసు పెరుగుతుందే కాని శరీర ఆకృతిలో మార్పు ఉండదు. అంటే రసజ్వల కారు. ఇలా జరగకపోత అమ్మాయి యుక్తవయసుకు రాలేదని అర్థం. దీంతో తల్లిదండ్రులలో అందోళన మొదలవుతుంది.

సాధారణంగా యుక్తవయస్సు రావడానికి ఓవరీలకు సంబంధించిన అంశాలో చాలా ముఖ్యం. ఇవి కనుక ఉత్పత్తి కాకపోతే అమ్మాయిలలో యుక్తవయసు రాదు. దీనికి ఆయుర్వేద వైద్యం మంచి పరిష్కారాలే సూచిస్తోంది. అమ్మాయిలకు యుక్తవయస్సు రాకపోతే ప్రవర్తినీ వటి, అశోకారిష్టం బాగా పని చేస్తాయని చెబుతున్నారు వైద్యులు.

అబ్బాయిల విషయానికొస్తే ఒక వయస్సు వచ్చిన తరువాత టెస్టోస్టిరాన్ అనే హార్మోను ఉత్పత్తి కాదు. ఫలితంగా యుక్త వయసు రాదు. జబ్బులతో కృశించి పోతుంటాడు. ఇలాంటి వారు చ్యవనప్రాశ లేహ్యం, అశ్వగ్రంధ లేహ్యం, టెంటెక్స్ పోర్ట్, మకరధ్వజ మాత్రలలో ఏదోకటి వాడవచ్చు. దీని వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ఆయుర్వేద మందులను సేవిస్తే సమస్యలు తొలగుతాయని ఆయుర్వేదం వైద్యులు చెబుతున్నారు.