మీకు నొప్పులా..

అమ్మో.. నొప్పి అబ్బో.. నొప్పీ అని చాలా మంది పదే పదే బాధపడుతుండటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కాని అవి సహజమేనని కొట్టిపారేసి మందుల షాపుకు వెళ్ళి పెయిన్ కిల్లర్లను తెచ్చి వాడుకోవటం పరిపాటైపోయింది. కానీ ఈ నొప్పి దీర్ఘకాలం కొనసాగితే అది ఏదో ఒక వ్యాధికి కారణం అవుతోందని గ్రహించాలి. నొప్పుల రకాలేమిటో ఈ శీర్షికలో తెలుసుకుందాం.

ఒక్కోసారి వ్యాధి కన్నా కూడా దాని కారణంగా వచ్చే నొప్పులు మరింత బాధను కలిగిస్తుం టాయి. ఆ నొప్పిని తట్టుకోవడం కష్టమవుతుం ది. కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, వెన్నెముక నొప్పి శరీరంలోని ప్రతీ అవయవం కూడా ఏదో ఒక కారణంతో నొప్పి కలిగించే అవకాశం ఉంది. ఇలాంటి నొప్పులను తగ్గించేం దుకు ఇప్పుడు ప్రత్యేక వైద్యచికిత్సలు పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. నొప్పులు ఎన్నో రకాలుగా ఉంటాయని నిర్ధారించారు. అవెంటో తెలుసుకుందామా..

1. అక్యూట్‌ అండ్‌ క్రానిక్‌ పెయిన్‌: అక్యూట్‌, క్రానిక్‌ పెయిన్‌ల మధ్య ఉండే తేడాను రోగి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ రెండిం టికీ చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. నొప్పిని వర్ణించేందుకు రోగి రకరకాల పదాలు వాడు తుంటారు. లాగుతున్నట్లుగా ఉందనో, మండు తున్నట్లుగా ఉందనో, నొప్పిగా ఉందనో, సూదు లతో గుచ్చుతున్నట్లుగా ఉందనో చెబుతుంటా రు. నొప్పి అనేది వ్యక్తిగతీకృతమైంది మాత్రమే గాకుండా అది వయస్సు, లింగం, మానసిక అంశాలపై కూడా ఆధారపడి ఉండడమేనని చెప్పవచ్చు.

2. అక్యూట్‌ పెయిన్‌ : సాధారణంగా ఏదైనా వ్యాధి, వాపు, గాయం కారణంగా ఏర్పడే నొ ప్పిని అక్యూట్‌ పెయి న్‌గా వ్యవహరిస్తుం టారు. తక్షణం ఏర్ప డే నొప్పి ఇది. సాధా రణంగా స్వల్ప కాల మే ఉంటుంది. ఏదై నా గాయం కలిగి నప్పుడు ఉద్వేగం, మానసిక ఒత్తిళ్ళతో కూడు కుని ఉండే బాధ ఇది. అక్యూట్‌ పెయిన్‌ను గుర్తించి, చికిత్స చేయడం సులభమే.

3. క్రానిక్‌ పెయిన్‌: క్రానిక్‌ పెయిన్‌ అనేది నిరం తరంగా కొనసాగే నొప్పి. సాధారణంగా మూడు నెలలకు మించి కొనసాగే నొప్పిని క్రానిక్‌ పెయి న్‌గా వ్యవహరిస్తారు. స్వల్పస్థాయి మొదలుకొని తీవ్రస్థాయి వరకు ఏ స్థాయిలోనైనా ఈ నొప్పి ఉండే అవకాశం ఉంది. వారాలు, నెలలు, ఏళ్ళు మొదలు కొని జీవితాంతం ఉండవచ్చు. క్రానిక్‌ పెయిన్‌ రోగి జీవనశైలిని, నిద్రను, ఉత్పాదక తను ప్రభావితం చేస్తుంది.

ఎన్నో రోగాల లక్షణం…నొప్పి: నొప్పి అనేది ఎన్నో రోగాల్లో కానవచ్చే సాధారణ లక్షణం. ఎముకలు, కండరాలు, కీళ్ళు, చర్మం.. సంబం ధిత వ్యాధుల్లో ఈ నొప్పి సాధారణంగా కన్పిస్తుం టుంది. వీటిల్లో చాలా రోగాలు దీర్ఘకాలం కొన సాగి జీవితాంతం బాధను కలిగిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో, మైఫాసియల్‌ పెయిన్‌ లక్షణాల్లో నొప్పికి కారణమేంటో అంతుపట్టదు. ట్రిగ్గర్‌ పాయింట్స్‌గా పేర్కొనే సున్నిత ప్రాంతా ల్లో నొప్పి కలుగుతుంటుంది. నొప్పిగా ఉన్నప్పు డు ముఖ్యంగా నిర్దిష్ట కాలవ్యవధిలో అది తగ్గన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

4. నొసిసెప్టివ్‌ పెయిన్‌: అంతర్గత కణజాలం తీ వ్రంగా దెబ్బతినడం వల్ల ఈ రకమైన నొప్పులు వస్తుంటాయి. నొసిసెప్టర్స్‌ అనే ప్రత్యేక సెన్సరీ న రాలు ఈ నొప్పికి గురవు తుంటాయి. మృదు కణజాలం (కండరాలు, చర్మం) అంతటా ఈ న రాలు ఉంటాయి. సంబంధిత కారణాలను బట్టి ఇది లోబ్యాక్‌ పెయిన్‌, మెడ నొప్పి, మోకాలి నొ ప్పి, భుజాల నొప్పి లేదా విస్‌సెరల్‌ (అపెండిసై టిస్‌, పాంక్రియాటిటిస్‌, సైస్టిటిస్‌)గా ఉంటుంది.

5. న్యూరోపతిక్‌ పెయిన్‌: నాడీవ్యవస్థ దెబ్బనడం కారణంగా వచ్చే నొప్పిని న్యూరోపతిక్‌ పెయిన్‌ గా వ్యవహరిస్తారు. కణజాలం గాయం కారణం గా అయ్యే నొప్పికి, నాడీవ్యవస్థ దెబ్బతినడం వల్ల కలిగే నొప్పికి ఎంతో తేడా ఉంటుంది. న్యూరోప తిక్‌ పెయిన్‌లో కణజాలం కోలుకున్నప్పటికి కూడా మెదడుకు ఆ ప్రాంతంలో బాధ ఉన్నట్లు గా సంకేతాలు అందుతూనే ఉంటాయి. అందుకే ఆ భాగంలో నొప్పి ఉన్నట్లుగా అన్పిస్తుంటుం ది. బ్యాక్‌పెయిన్‌తో పోలిస్తే ఈ నొప్పి ఎంతో తే డాగా ఉంటుంది. మెరుపు వచ్చినట్లుగా, తీవ్రం గా, పొడుస్తున్నట్లుగా, మండుతున్నట్లుగా, చల్ల గా ఉన్నట్లుగా, తిమ్మిరిపట్టినట్లుగా ఈ నొప్పిని రకరకాలుగా వర్ణిస్తుంటారు. బలహీనపడిన ట్లుగా అన్పిస్తుంటుంది. మెడ నుంచి భుజాలు, చేతుల వరకు లేదా వెన్ను దిగువ భాగం నుంచి కాళ్ళు, పాదాల వరకు నొప్పి వెళు తున్నట్లుగా ఉంటుంది.

6. క్యాన్సర్‌ పెయిన్‌: క్యాన్సర్‌ వ్యాధి ఏ దశలోనైనా రోగులు తీవ్రమైన నొప్పికి గుర య్యే అవకాశం ఉంది. పెద్ద కంతి కారణం గా నరాలు చివర్లు ఒత్తిడికి గురి కావడం లేదా కంతి నుంచి ఎముకకు, ఇతర భాగా లకు రోగసంబంధ కణవ్యాప్తి కార ణంగా నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. నేడు క్యా న్సర్‌ను ఆరంభదశలోనే గుర్తించే అవకాశం ఉంది. ఈ రోగులకు కావాల్సిందల్లా నొప్పి ఉప శమన చికిత్స మాత్రమే. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా చేసే రేడియో థెరపీ, కెమోథెరపీల కార ణంగా తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది.

7. విస్‌సెరల్‌ పెయిన్‌: అంతర్గత అవయవాల కారణంగా వాటిల్లే నొప్పిని విస్‌సెరల్‌ పెయిన్‌గా వ్యవహరిస్తుంటారు. వీటికేదైనా నష్టం, హాని కలిగినప్పుడు, బాధను గుర్తించే నరాలు వెన్నె ముకకు, మెదడుకు నొప్పి సంకేతాలను పంపి స్తుంటాయి. ఇతర నొప్పుల మాదిరిగా గాకుం డా ఈ రకమైన నొప్పి ఎక్కడ ఉందో కచ్చితంగా నిర్ధారించడం రోగికి కష్టమే. చాలా సంద ర్భాల్లో ఇది సాధారణ నొప్పి లేదా పిండుతున్నట్లుగా ఉంటుంది. ఆయా అవయవాల చుట్టూరా చో టు చేసుకునే ఒత్తిడి కారణంగా లేదా పొత్తి కడుపు మార్గం వ్యాపించడం వల్ల ఇలా జరుగు తుంది. కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరిస్తుంటుంది. దీంతో నొప్పి చ్చితంగా ఎక్కడ ఉందో గుర్తించడం మరింత కష్టమవుతుంది. తొడ ప్రాంతంలో ఏర్పడే మూత్రకోశ, మలాశయ సంబంధిత నొప్పులను కూడా విస్‌సెరల్‌ పెయిన్‌గా వ్యవహ రిస్తుంటారు. నొప్పి వచ్చినప్పుడు వెంటనే తగ్గకపోతే సమస్యలు పెరిగే అవకాశముంది కనుక వైద్య సలహా తీసుకోవడం మంచిది.