“గ్లిసరిన్” వల్ల చర్మ రక్షణ మరియు జుట్టు సంరక్షణ ఎలా సాద్యమంటే??

glycerin

గ్లిసరిన్ అనేది కార్బన్ మిశ్రమాలలో ఒకటి. దీనిని రసాయనిక శాస్త్రంలో “C3H8O3” లేదా గ్లిసరాల్   అని పిలుస్తారు. ఈ గ్లిసరాల్ అనేది చుట్టుపక్కల ఉండే నీటిని గ్రహిస్తుంది.దీనిని మనం ఉపయోగించినట్లయితే మన చర్మాన్ని తేమగా ఉంచేటందుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.ఇది ప్రముఖమైన ఫార్మసీ దుకాణాలలో లభిస్తుంది.దీనిని తయారుచేసిన తరువాత 2 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు, ఐతే కొనుగోలు ముందు లేబుల్ని చూసి తీసుకోండి.

 

అందం కోసం “గ్లిసరిన్”  చెప్పే అందమైన చిట్కాలు చూద్దామా

 

 “చర్మం యొక్క మాయిశ్చరైజర్ గా”  

ఒక వేళ మీ చర్మం పొడిగా ఉంటే , కొంచెం గ్లిసరిన్, మరి కొంచెం తేనె కలిపి,ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్న చర్మానికి,లేదా చేతులకి, లేదా కాళ్ళకి పట్టించి 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే పొడిగా ఉన్న మీ చర్మము యొక్క సమస్య పోయి తేమగా మారుతుంది.

 

వాడిన\మాడిన\ఎండిన జుట్టు సం రక్షణకై:

 ఎంతో మంది వారి జుట్టు ఎండిపొయినట్లుంది అని ఎంతగానో బాధపడుతూ ఉంటారు, ఈ సమస్య జుట్టులోని తడితనం అంటే తేమ లేకపొవడం వల్లనే, అయితే మీ జుట్టుకి గ్లిసరిన్ పట్టిస్తే మంచి మార్పును మీరు గమనించి అందమైన,మృదువైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు.

 

హెయిర్ స్ప్రే:

కొంచెం గ్లిసరిన్ , నీరు కలిపి, ఒక  స్ప్రే బాటిల్లో పోసి మీ జుట్టుకి పట్టిస్తే మీ గిరజాల జుట్టును కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది జుట్టుకి మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది.

 

చర్మాన్ని శుబ్రపరచడంలో “గ్లిసరిన్” పాత్ర:

 1 టేబుల్ స్పూన్ గ్లిసరిన్, 2 టేబుల్ స్పూన్లు తేనె, 2 టేబుల్ స్పూన్లు పాలు తీసుకోండి.ఈ మూడు పదార్థాలు కలపండి,ఈ మిశ్రమాన్ని వోట్మీల్ జోడించండి, ఒక పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించండి,గ్లిసరిన్ ను తక్కువ శాతంలో వాడటం మంచిది, ఇలా రాసుకున్న మిశ్రమము మీ చర్మంలోని దుమ్ము, ధూళి,వల్ల మూసుకుపొయిన చర్మ రంద్రాలను శుబ్రం చేసి, మీ ముఖానికి అందమైన,మరియు ప్రకాశవంతమైన సౌందర్యన్ని తెస్తుంది.

 ఇంకెందుకు ఆలస్యం, పైన చెప్పినవన్నీ పాటించండి, తళ తళ లాడే అందాన్ని మీ సొంతం చేసుకోండి.