ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీ జుట్టుని ఇలా దువ్వుకోండి!

combing

 

మన జుట్టు సాధారణంగా పొడవుగా ఉండాలన్నా, అందంగా ఏరకమైన పగుళ్ళు లేకుండా ఉండాలన్నా,మంచి బలమైన జుట్టుని పొందాలన్నా,అందరికీ తెలిసిందే అయినా ఎంతో మంది గమనించని చిట్కా ఏమిటంటే “సరియైన పద్దతిలో జుట్టు దువ్వుకోవడమే”.

  • ఆరోగ్యకరమైన, నిగ నిగ లాడే జుట్టు పొందాలంటే సరియైన పద్దతిలో జుట్టు దువ్వుకుంటే సరిపోతుంది.
  •  మొట్టమొదటిగా మంచి బ్రష్ ని ఉపయోగించండి,మీ బ్రష్ యొక్క పళ్ళు పొడవుగా,విశాలమైనవి గా ఉండటం మంచిది. దీని వల్ల మీరు మీ బ్రష్ ని మీ వేళ్ళతో నొక్కినప్పుడు మీ జుట్టు పై మంచి ప్రభావం చూపిస్తుంది.ఈ పద్దతి మంచి పొడువైన జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది.
  • మీ జుట్టుని మధ్యలో నుంచి 2 భాగాలుగా చేయండి, ఒకటి కుడి భుజం పైకి,మరొకటి 2వ భుజం పైకి. మీ జుట్టు మొదలు నుంచి చివరి వరకు మెల్లగ దువ్వుకుంటే మధ్యలో చిక్కులు ఉన్నా, జుట్టూ పగిలినా,అటువంటి ఇబ్బందులని నివారించవచ్చు.
  • పొడవైన జుట్టు కోసం ఇంకొక చిట్కా ఏమిటంటే మీ జుట్టులోని చిక్కులు అన్నీ తీసేసిన తరువాత, మెల్లగా మీ నడుం పై వంగి మీ జుట్టుని మీ మెడ భాగంలో మొదలు పెట్టి చివరి వరకూ దువ్వుకోండి,దీని వల్ల మీ జుట్టు పొడవుగా ఎదగడానికి మంచి బలం\ఉత్తేజం లబిస్తుంది.
  • ముఖ్యమైనది, గమనించవలసినది ఏమిటంటే మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు, దువ్వకండి, ఎందుకంటే తడిగా ఉండే సమయంలో మీ జుట్టు సాగుతుంది దానివల్ల జుట్టు యొక్క మొదళ్ళు విరిగిపొయి, జుట్టు ఊడిపోయే ప్రమాదం ఎక్కువ అందుకే, పొడిగా మార్చి దువ్వుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఒకవేళ చిక్కులు తీసి దువ్వుకోవాలంటే, మంచి పొడవైన పళ్ళు ఉన్న దువ్వెనని ఉపయోగించండి.
  • రోజూ పడుకునే ముందు మీ జుట్టుని సరియైన పద్దతిలో దువ్వుకోండి, ఏమైన చిక్కులు ఉంటే తొలగిపోతాయి, ముందు జుట్టు చివరి భాగంలో మొదలుపెట్టి, మెల్లగా జుట్టు మొదళ్ళు వరకూ చిక్కులు ఎమైన ఉంటే తొలగించాలి, అంతా అయిపొయినతరువాత, మొత్తంగా ఒక్కసారి మీ జుట్టుని దువ్వుకోండి.
  • కొంచెం నూనె రాసుకుని చివరివరకూ 100 సార్లు చిక్కులు పొయేంతవరకు దువ్వుకుంటే,నిద్రపోయేటప్పుడు చిక్కులు లేకుండా, మరుసటి రోజు చిక్కులులేని అందమైన జుట్టుని పొందవచ్చు. ఈ పద్దతివల్ల బలహీనంగా ఉన్న మీ జుట్టుకి మంచి బలాన్ని ఇచిన వారౌతారు.
  •   మీ జుట్టుని దువ్వుకునేప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి, కంగారుపడకుండా మెల్లగా, చిక్కులని తొలగించుకుంటూ దువ్వుకోవడం వల్ల జుట్టు విరిగిపొయే ప్రమాదం తప్పుతుంది.

అందమైన, పొడవైన జుట్టు కావాలంటే ఈ పద్దతులుతో పాటు సరియైన సమయంలో నూనెని రాస్తూ ఉండాలి.

 మీ అందం మీ చేతుల్లోనే….పైన చెప్పినవి పాటించండి…ఆనందంగా జీవించండి.

NO COMMENTS