మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా?అందమైన జుట్టు మీ సొంతం కావాలన్నా, మీ జుట్టు బాగా పెరగాలన్నా ఈ చిట్కాలు పాటించండి

hair care

మీ జుట్టు రాలకుండా, బలంగా,ఉండడానికి,బాగా పెరగడానికి ఈ చిట్కాలు మీ కోసమే:

 జుట్టు రాలిపోవడం అనేది, ఆడవారిలోను, మరియు మగవారిలోను సామన్యంగా కనిపించే అతి పెద్ద సమస్య.సాధారణంగా ఇది మన శరీరంలోని హార్మోన్లు నిలకడగా లేకపోవడం వల్ల, మరియు మన థైరాయిడ్ గ్రంధి చురుకుగా పనిచేయకపోవడం వల్ల పొషక లోపం వల్ల అంటే మన తీసుకునే  ఆహారంలో సరియైన పోషక పదార్దాలు లేకపోవడం, జుట్టు యొక్క మొదళ్ళలో తగినంత రక్త ప్రసరణ లేకపోవడం,వారసత్వం వల్ల కలిగే జన్యుపరమైన మార్పుల వల్ల కూడా వస్తుంది.

మీ జుట్టు రాలకుండా, బలంగా,ఉండడానికి,బాగా పెరగడానికి ఈ  చిట్కాలు మీ కోసమే:

  •  మన జుట్టు ఊడిపోవడానికి, సన్నగా అయిపోవడానికి కారణం హార్మోన్లు నిలకడగా లేకపోవడమే కారణం, అందుకే జుట్టూ మొదలి భాగములలో ఎక్కువ శాతం నూనె రాస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.
  •  “పాల్మెట్టో “ ఉన్న మూలికను తీసుకోవడం వల్ల, మగవారిలోని  జుట్టు శాతం పెరిగే అవకాశం ఎక్కువ, ఈ “పాల్మెట్టో” ఉన్న మూలిక జుట్టు పెరుగుదలలో ఒక ప్రత్యామ్నాయ ఔషధంగా ఎంతో ఉపయోగపడుతుంది. 400మిగ్రా “పాల్మెట్టోని” 100మిగ్రా “Beta-Sitosterol” తో  కలిపి తీసుకుంటే  మగవారిలోని జుట్టు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
  • ఈ  పాల్మెట్టో చారిత్రాత్మికంగా మగవారికి, ఆడవారికి సున్నితమైన జుట్టుని ఇవ్వడంలో ఎంతో సహాయపడుతుంది.
  • సరిగా పనిచేయని థైరాయిడ్ గ్రంధి వల్ల కూడా జుట్టు పల్చబడిపోవడం జరుగుతుంది, మీరు తీసుకునే కూరగాయలలో “kelp, nori, dulse, kombu”, మరియూ wakame,కలిగి ఉన్నవి తీసుకుంటే, వీటిలోని “అయోడిన్”మీ జుట్టు సం రక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • మద్యపానం తగ్గించుట ఎంతో శ్రేయస్కరం, ఎందుకంటే ఈ మద్యం నీటిలో  క్లోరిన్ అదనంగా ఉంటుంది, మీరు 100మి.లీ లేదా మి.గ్రా  “herb bladderwrack” తీసుకోవడం జరుగుతుంది.
  • తగినంత కొవ్వుతో కూడిన పదార్దాలు తీసుకోవడం వల్ల మరియు అక్రోటు కాయ,అవెకాడో పండు, చేప, వల్ల చక్కని గిరజాల జుట్టుని పొందే అవకాశం ఎక్కువ.
  • బోయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టును ఇవ్వడమే కాకుండా, దాని పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది.అందుకే కాయలు, బియ్యము, ఓట్స్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
  • మన జుట్టూ లోపల ఉన్న ప్రొటీన్ ఎదైతే ఉందో అదే “కెరాటిన్”, దీనిని ఎక్కువ శాతం పెంచుకోవడం వల్ల కూడ మీ జుట్టుని అందంగా ఉంచుకోవచ్చు, అంతే కాకుండా ఇది మీ జుట్టు బలోపితం చేసి,పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
  • “బి కాంప్లక్స్” పోషక పదార్దములు తీసుకుండి: వీటిని రోజు 100 మి.గ్రా తీసుకోవడం వల్ల మీ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది.ఈ “బి కాంప్లక్స్” పోషక పదార్దములు, అయోడిన్,మరియు “బి6” పోషక పదార్దములు కలిగి ఉండడం వల్ల మీ జుట్టులోని రక్త ప్రసరణను పెంచి, జుట్టు సన్నబడటాన్ని  తగ్గించి,6 నెలలలో అందమైన జుట్టిని ఇస్తుంది.
  • మీ గిరజాల జుట్టుని కాపడుకోవాలంటే “కొల్లాజెన్ “ను తీసుకోవాలి. ఇది మీ జుట్టు పగుళ్ళను ఆపుతుంది, రకరకాల మందుల ద్వార కాకుండా,250 గ్రా “విటమిన్ సి” తో కుడిన ఆహారం అంటే సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీ మరియు ఎరుపు మిరియాలు తీసుకోవడం వల్ల “కొల్లాజెన్ ” శాతం పెరిగి, మీ జుట్టు ముడతలు పడకుండా కాపాడుతుంది.
  •  మీ జుట్టు పగిలిపోకుండా కాపడుకోవాలంటే “విటమిన్ ఈ” తో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి, ఇది జుట్టు లోపల ఉన్న ప్రొటీన్ ఎదైతే ఉందో అదే “కెరాటిన్” శాతం పెంచి జుట్టు, పగలకుండా,కాపాడుతుంది.
  • ఆకు కూరలు లీక్స్, జీడి, ఎండు ఫలాలను, అత్తి పండ్లను తీసుకోవడం వల్లకూడ మీ జుట్టూ పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

 

మీ జుట్టు కి సరియైన పొషక పదార్దాలు ఇవ్వండి:

రోజు మీ అహారంలో 500మి.గ్రా  సిలికా మరియు 30 మి.గ్రా జింక్ తో కూడిన పదార్దాలు తీసుకుంటే మీ రాలిపోతున్న జుట్టూ తిరిగి పెరగడానికి ఎంతో ఉపయోగ పడుతుంది.

రోజ్మేరీ నూనె తో జుట్టు రక్త ప్రసరణను పెంచండి, ప్రతీరోజూ మీ కొబ్బరి నూనెతో పాటూ రోజ్మేరీ నూనెను కూడా కలిపి మీ జుట్టుకి పట్టించుకుంటే,మంచి ఫలితాలు పొందవచ్చు.

మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా?అందమైన జుట్టు మీ సొంతం కావాలన్నా, మీ జుట్టు బాగా పెరగాలన్నా  ఈ చిట్కాలు పాటించండి

NO COMMENTS