మీ ఆరోగ్యానికి నీరు..!

కడుపుకు తినపోయినా కనీసం మంచినీళ్ళు ఉంటే బ్రతుకు బండి ఈడ్చేయవచ్చు. కానీ నీటి విలువ మన శరీరానికి అంతకంటే ఎక్కువ ఉంది. నీటితో అనేక రుగ్మతలు, వ్యాధులు మతుమాయమవుతాయంటే నమ్మశ్యఖ్యంగా లేదు కదూ..! నీరు మన శరీరానికి ఎంత అవసరమో అంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండి. అవేంటో తెలుసుకుందామా…

  1. శరీరంలో నీటి శాతం సక్రమంగా ఉండాలి. ఇది ఏమాత్రం తక్కువున్నా చర్మం ముడతలు పడడం, పొడిబారిపోవడం, చర్మ సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీటి శాతం 75 నుంచి 80 వరకు ఉండాలి.

2. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. చర్మం మంచి నిగారింపును పొందుతుంది.

3. శరీరంలోని నీరు చెమట, మూత్రం రూపాల్లో బయటికి పోతుంది. దీంతో శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది. కనుక ఆ నష్టాన్ని పూడ్చడానికి ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కువ నీటిని తీసుకోవడంతో అధిక బరువు ఉన్నవారు కూడా తగ్గుతారు.

4. పెదాల పగుళ్లను నివారించి సున్నితంగా, అందంగా చేస్తుంది. చర్మం తేమగా ఉండాలంటే సరిపోను నీరు తప్పనిసరి.

5. ముఖం మీద ఏర్పడ్డ ముడతలను మట్టుమాయం చేయడంలో నీరు చేసే పనితీరే వేరు. మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు వచ్చే అవకాశముండదు.

6. చెమట ద్వారా శరీరంలోని మలినాలను బయటికి పంపడంతో దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు.

7. అందం విషయంలో కళ్లు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. నీళ్లు తాగడంతో పాటు రోజులో అప్పుడప్పుడు కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కళ్లు తాజాగా, ఆకర్షణీయంగా కనబడుతాయి.

 ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలు:  

నీరు త్రగితే మంచిది కదా అని పరిమితికి మించి త్రాగితే మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దాంతో ఆనారోగ్య బారిన పడాల్సిన ప్రమాదముంది. ఎక్కువ దాహం వేసినప్పుడైనా, మళ్లీ మళ్లీ తాగాల్సి వస్తుందని ఒకేసారి గ్లాసులకొద్దీ నీరు తగడం సరైన పద్ధతి కాదు. దాంతో మేలుకన్నా కీడే ఎక్కువగా ఉంటుందనేది తెలుసుకోవాలి.