మహిళల ఆరోగ్యానికి..!

నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలు అవుతున్నారనటం నిజం. కాని మహిళల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని పాటిస్తే చాలు అంటున్నారు న్యూట్రీషియన్లు. మహిళలకు ఏమేమి అవసరమో ఈ శీర్షికలో మేమందిస్తున్నాం. అవేంటో చూద్దామా..!

1. మహిళలకు క్యాల్షియం, డి విటమిన్ ఎంతో అవసరమని న్యూట్రీషన్లు అంటున్నారు. క్యాల్షియం, డి విటమిన్ లోపించినపుడు నడుము నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇక్కట్లు తప్పవు. దీనికి పరిష్కార మార్గం కోడిగుడ్డులో తెల్లసొనతో పాటు, నట్స్ ద్వారా విటమిన్ డి లభిస్తుంది.

2. డి విటమిన్ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చర్మంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.

3. కండరాలు పటిష్టంగా ఉండటం చలా ముఖ్యం అంతేకాక హృదయం సరిగ్గా పనిచేసేందుకు, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా ఉండేందుకు డి విటమిన్ ఎంతో అవసరం.

4. గర్భిణీ మహిళలకు క్యాల్షియం, విటమిన్ డి చాలా ముఖ్యం. ఎందుకంటే వారు గర్భిణీగా ఉన్నప్పటి నుంచీ ఈ రెండు అందకపోతే గర్భధరణ సమయంలో సమస్యలు వచ్చే ప్రమాదముంది.

5. నడి వయస్సు వచ్చిన మహిళల్లో నేడు కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అందువల్ల 35 ఏళ్లు దాటిన మహిళలకు తప్పకుండా ఐరన్, క్యాల్షియం, డి విటమిన్ అవసరం.

6. ఇక మహిళలకు క్యాల్షియం, డి విటమిన్, ఐరన్ లోపించకుండా ఉంటే కొలెస్ట్రాల్ సమస్యలు, కీళ్లనొప్పులు, మోకాలి నొప్పులు, నడుము నొప్పులకు చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.