మీ అరిచేతుల్లో చెమటలా?

మీ చేతులు ఎప్పుడూ చమటతో తడిసిపోతున్నాయా? ఎవరికైన షేక్ హండ్ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతునారా? టెన్షన్ లేకపోయినా ఇదే సమస్య కనపడుతోందా? దీని వల్ల ఆత్మ న్యూన్యతా భావం ఏర్పడుతోందా?తరచూ ఈ సమస్యతో బాధ పడేవారికోసం తెలుగు టిప్స్ అందిస్తోంది ఈ సమస్యకు పరిష్కారాల్ని మీ కోసం. అవేంటో చూసేద్దామా!

పెద్ద వాళ్ళ జనాభా లో 1 – 3% మందికి అధిక స్వేదం సమస్య వుందని అంచనా. సమస్య చేతుల్లోనే అయితే దాన్ని పామర్ హైపర్ హిడ్రోసిస్ అంటారు. కొంతమందికి ఈ సమస్య దానంతకు అదే తగ్గిపోతుంది. మరి కొందరికి చికిత్స అవసరం. మీ సమస్యకు కారణాలు, దాని తీవ్రతను బట్టి మీకందించే చికిత్స ఆధారపడి వుంటుంది. కొంతమందికి ఇంజక్షన్లతో, మరి కొందరికి శస్త్ర చికిత్సతో తగ్గవచ్చు. అదృష్టవశాత్తు, మీరు సూది మందు, ఆపరేషన్ వద్దనుకుంటే సహజమైన చికిత్సలు కూడా అందుబాటులో వున్నాయి.

 

1. మీ అరచేతుల మీద టాల్కం పౌడర్ గానీ, గంజి పిండి గానీ రుద్దుకోండి. ఈ రెండూ తేమను బాగా పీలుస్తాయి. వాటిని ఎక్కువగా కూడా వాడే పని లేదు. మీరు బయటకు వెళ్ళే ముందు చేతులకు కొద్దిగా పట్టిస్తే చాలు.

2. సుగంధం లేని చెమట నివారిణి మీ చేతులపై వాడండి. కొన్ని చెమట నివారిణులు కేవలం చేతులు, కాళ్ళ కోసం తయారు చేస్తారు. సెంట్ వున్నవి వాడకండి, ఎందుకంటే వాటిలో వుండే రసాయనాలు చెమటను కలిగిస్తాయి. అల్యూమినియం క్లోరైడ్ వున్న చేతి మాయిశ్చరైజర్ వాడండి. ఇది చేతి రంధ్రాలను మూసి వేసి చెమటను నిరోధించగల ఆస్ట్రిన్జేంట్.

3. కొన్నిసార్లు వత్తిడి లేదా ఆందోళన వల్ల చేతులకు చెమట పట్టవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అవసరమైనదంతా చేయండి. రిలాక్సేషన్, ప్రాణాయామం మెళకువలు నేర్చుకోండి – మీకు ఆందోళన కలుగుతు౦దనగా వాటిని వాడండి.

4. లోంటోఫేరేసిస్ అనే చికిత్స గురించి నేర్చుకోండి. ఇది నీరు, విద్యుత్ తరంగాలతో కూడిన పరికరం. నీరు, విద్యుత్ తరంగాల కలయిక అధికంగా పని చేసే స్వేద గ్రంధుల మీద షాక్ లాగా పని చేసి అధిక చెమటను నిరోధిస్తాయి.

5. మీ చేతులను రోజులో పలుసార్లు కడుక్కోండి. దుమ్ము, బాక్టీరియా వల్ల చెమట పడుతుంది కనుక చేతులను అన్నివేళలా శుభ్రంగా వుంచుకుంటే చెమటను నిరోధించవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక హాండ్ సానిటైజర్ ను, చేతి రుమాలును తీసుకు వెళ్ళండి – ఒక వేళ కడిగే అవకాశం లేకపోతె పనికివస్తాయి.

మసాలా ఆహారాలు తినకండి. వాటిలో కాప్సైసిన్ వుంటుంది – అది నరాల చివరలను ప్రేరేపించి, శరీర ఉష్ణోగ్రతను పెంచుతు౦ది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మీకు చెమట ఎక్కువ పడుతుంది.

6. ఫాస్ట్ ఫుడ్ లేదా ప్యకేజ్ చేసిన ఆహారం తినకండి. అవి అనారోగ్య కరమైనవే కాక మీకు చెమట ఎక్కువగా కలిగిస్తాయి. దీని వల్ల ఇలాంటి ఆహారంలో ప్రాసెస్ చేసిన పదార్ధాలను జీర్ణం చేయడానికి మీ శరీరం మరింత శ్రమించాలి.

7. చెమట పట్టకుండా ఉండడానికి మూలికా వైద్యం కూడా ప్రయత్నించండి – వలెరియన్ వేరు, చమోమెయిల్, టీ ట్రీ ఆయిల్, లేదా సెయింట్ జాన్స్ వోర్ట్ లాంటివి. వీటిని నోటిలోకి తీసుకోవచ్చు లేదా చేతుల మీదికి నేరుగా రాసుకోవచ్చు. చెమట పట్టే అరచేతులకు ఉత్తమ వైద్యం సెజ్. ప్రతి రోజూ సేజ్ మాత్రలు లేదా సేజ్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉండవచ్చు.

8.సేజ్ టీ తో పాటు మీరు ఆపిల్ సిడార్ వినేగార్ లేదా టమాటో రసం కూడా తాగండి. ఈ పానీయాలు అరచేతులకు చెమట పట్టడ౦ నుంచి విముక్తి కలిగిస్తాయి. వీటిలో ఒక దాన్ని ఎంచుకుని రోజూ ఒక కప్పు తాగండి.

ఈ చిట్కాలు మీ పామర్ హైపర్ హిడ్రోసిస్ ను బాగా తగ్గించలేక పోవచ్చు కానీ చెమట పట్టడాన్ని బాగా తగ్గిస్తాయి. ఇంకా ఈ సమస్య అలాగే కొనసాగితే డాక్టరుని సంప్రదించండి.