మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు కొన్ని చిట్కాలు – Telugu tips for joint pains

fఅమ్మో నొప్పి.. అయ్యో నొప్పి అని మనం చిన్న నొప్పి కలిగితే చాలా బాధ పడుతుంటాం. అయితే ఇప్పుడున్నా బిజీ లైఫ్ లో వాటి నివారణకు మాత్రం డాక్టరు వద్దకు మాత్రం వెళ్ళనే వెళ్ళం. ఏదో ఓ పైన్ బాం రాసి సర్ది చెబుతుంటాం. అయితే ఏ వ్యాధి అయినా ముదిరాక డాక్టరు వద్దకు వెళితే నయం కాదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం’ అన్న చందంలో మన జీవితం తయారవుతుంది. ఏముందిలే నొప్పులేగా అనుకుంటే అది ఖచ్చితంగా మీ పొరబాటే. కాక పోతే కీళ్ళ నొప్పులు మొదలైనప్పుడే వాటికి కాస్త ఉపశమనంగా ఉండేందుకు కొన్ని చిట్కాలను ఇస్తున్నాం. వాటిని చూద్దామా..!

కీళ్ళ నొప్పులు ఒకనాడు మన బామ్మలకో లేక మన తాతలో వస్తే వారి బాధను మనం చూసే వాళ్ళం. ఎందుకంటే వారి వయస్సు పెరిగి ఎముకలు అరగటం వల్ల ఈ సమస్య ఏర్పడేది. కాని నేటి జనరాషన్ కి ఇది మామూలైపోయింది. ఇప్పుడు వయసు తేడాలు లేకుండా ఈ సమస్య వస్తోంది.

కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని మనకు భయమ మొదలవుతుంది. ఆ భయంతోనే హాస్పిటల్ కు వెల్లి చూపించుకోవాలంతే భయపడతాం. అయితే కొన్ని చిట్కాలను ఉపశమనం పొందే దిశగా వాదుకోవచ్చు.

1. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగాపిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి.

2. సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూయాలి.

3. తేలిక పాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి.

4. క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.

5. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.

Subscribe to Blog via Email

Join 9,491 other subscribers

6. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, కమలాపండు మొదలైనవి.

7. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.

8. కాస్త ఉప్పుకలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయాలి.

9. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

ఇలా ఈ చిట్కాలను చేసుకోవటం వల్ల కీళ్ళ నొప్పులను మొదటి దశలోనే అరికట్టవచ్చు.