Telugu tips for PCOD – పాలిసిస్టిక్ ఓవరీయన్ డిసీస్ (PCOD) కు గృహ నివారణలు

పాలిసిస్టిక్ ఓవరీయన్ సిండ్రోమ్ (PCOS)/ పాలిసిస్టిక్ ఓవరీయన్ డిసీస్ (PCOD) అనే వ్యాధి స్త్రీలలో సంతానోత్పత్తి వయసులో కనిపించే ఒక హార్మోన్ సంబంధిత వ్యవస్థ రుగ్మత. PCOSతో బాధపడుతున్న మహిళలు ఫాలికల్‌లు (ద్రవ సంగ్రహములు) కలిగిన పెద్ద అండాశయాలను కలిగి ఉంటారు. ఈ పరిస్థితి హార్మోన్ల వలన మరియు జీవనశైలి వలన ఏర్పడుతుంది. అధిక బరువు ఉండటం దీనికి ముఖ్యకారణం. జెనెటిక్స్ వలన కూడా రావచ్చు. PCOD వలన చాలా సమస్యలు రావచ్చు. ఉదాహరణకు అరుదైన రుతుస్రావం, జుట్టు పలుచగా కావటం, జిడ్డు చర్మం, ఆకలి లేకపోవడం, గర్భం ధరించడంలో సమస్యలు ఇంకా ఎన్నో.

సరైన చికిత్స ద్వారా ఈ సమస్యను తొలగించవచ్చు. మీరు ఇంటి చిట్కాలతో పాటు ఆరోగ్యకరమైన వ్యాయామాలను మరియు సరైన జీవన శైలిని పాటిస్తే PCOSను సమర్థవంతంగా నయం చేయవచ్చు. ఒకవేళ ఈ సమస్య ఆధునిక దశలో ఉన్నట్లయితే మీరు తప్పకుండా హార్మోన్ల మందులను వాడాలి.

పాలిసిస్టిక్ అండాశయ వ్యాధికి సమర్థవంతమైన గృహ నివారణలు

ఆముదము

హార్మోన్ల లోపాలను చికిత్స చేయడంలో ఆముదం ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీనిని పూయటం వలన కడుపు క్రింద ప్రాంతంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ఎక్కువ ఫలితాన్ని పొందేందుకు సేంద్రీయ ఆముదమును వాడండి. హాట్ బాగ్ పై కొన్ని చుక్కల ఆముదమును వేసి ఇది చల్లబడే వరకు మీ ఉదరంపై రాయండి.

పామ్ బెల్లం

PCOD సమస్య ఉండే వారికి ఇన్సులిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అందువలన వీరు తెల్లని చక్కెరను వాడకూడదు దానికి బదులుగా పామ్ బెల్లంను వాడాలి. ఇది ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.

సా పాల్మెట్టో

పచ్చి ‘సా పాల్మెట్టో’ సారంను తీసుకోవాలి. ఇవి PCOD రోగులలో సాధారణంగా ఎక్కువగా కనిపించే టెస్టోస్టెరాన్ను నియంత్రిస్తుంది.

గమనిక: శిశువుకు తల్లి పాలు ఇస్తున్న స్త్రీలు దీనిని ఉపయోగించకూడదు.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్ స్థాయిని మరియు హార్మోన్ల పెరుగుదలను చాలా ప్రభావితంగా నిర్వహిస్తుంది. కొన్ని గుమ్మడికాయ గింజలను ఒక బౌల్ నీళ్లలో నానపెట్టి త్రాగండి. లేదా ఒక పేస్ట్‌లా చేసి నీటిలో కలుపుకొని త్రాగండి.

జీలకర్ర

జీలకర్రలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను కూడా నియంత్రిస్తుంది. కొన్ని పచ్చి జీలకర్రను పొడి చేసుకొని నీలల్లో కలిపి త్రాగండి.

కొబ్బరి నూనె

PCOS సమస్యతో పోరాడటానికి కొబ్బరి నూనె ఒక అద్భుతమైన నివారిణి. ఒక టేబుల్ స్పూన్ నాణ్యమైన పచ్చి కొబ్బరి నూనెని రోజూ తీసుకోండి. దీనిని నేరుగా లేదా మీరు తినే సలాడ్స్, స్మూతీస్ లో కలుపుకొని తినండి. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయులను మరియు ఇన్సులిన్ స్రావంను నియంత్రిస్తుంది.

దాల్చిన చెక్క

ఇది PCOS సమస్యకు ఒక అద్భుతమైన నివారిణి. రోజూ ఒక టేబుల్ స్పూన్ చెక్క పొడిని వెచ్చని నీటిలో కలుపుకొని తెల్లవారు జామున ఖాళీ కడుపుతో త్రాగండి. లేదా ఒక దాల్చిన చెక్క ముక్కని మొత్తం తినవచ్చు. మీరు రోజూ తినే ఆహారాలు ఉదాహరణకు స్మూతీస్, ఫల రసం, డెస్సర్ట్స్ లేదా టీలో చేర్చుకొని త్రాగవచ్చు. ఇది ఎక్కువ కేలరీలను దహించి రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరీకరించి జీవక్రియను అధికరిస్తుంది.

గమనిక: దాల్చిన చెక్కను దీర్ఘకాలం వ్యవధిలో ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మీ కాలేయంపై దుష్ప్రభావం కలిగించే అవకాశాలు ఉన్నాయి.

గ్రీన్ టీ

ఇది PCOS సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్ మరియు యాంటీ-ఇంప్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ‘పాలీఫెనోల్స్’ స్థాయి ఎక్కువగా ఉన్నందున ఇది రక్త కణాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది.

గ్రీన్ టీ ఆకులను వేడి నీటిలో 3-4 నిమిషాల పాటు ఉంచి, వడగట్టి కొద్దిగా తేనెని కలుపుకొని త్రాగండి. దీనిని రోజుకు 3-4 సార్లు తీసుకోవడం వలన మీ బరువు తగ్గటానికి కూడా సహాయ పడుతుంది.

మెంతులు

మెంతులు మీ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నిర్వహించడం ద్వారా PCODని గుణ పరిచేందుకు ప్రభావితంగా పని చేస్తుంది. మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి పొద్దున వడగట్టి ఖాళీ కడుపుతో త్రాగండి. రోజుకు 3 సార్లు ఈ నీటిని త్రాగండి; తెల్లవారు జామున ఖాళీ కడుపుతో ఒక సారి, మధ్యాహ్నం భోజనం చేసే 5 నిమిషాల ముందు ఒక సారి అలాగే రాత్రి డిన్నర్ తినే 5 నిమిషాల ముందు ఒక సారి. వండిన మెంతాకులను కూడా తినవచ్చు.

అవిసెగింజలు

అవిసెగింజలలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ మరియు లిగ్నన్స్ కూడా ఎక్కువగా ఉన్నందున శరీరంలోని ‘టెస్టోస్టెరాన్’(వృషణముల స్రావము) ని సమర్థవంతంగా తొలగిస్తుంది, దీని ద్వారా PCOD నియంత్రించబడుతుంది.

అవిసెగింజల పొడిని నీలల్లో కలుపుకొని ఖాళీ కడుపుతో తెల్లవారు జామున త్రాగాలి లేదా గింజలను నమిలి తినవచ్చు.

తులసి ఆకులు

‘ఆండ్రోజెన్’ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన కూడా PCOS సమస్య వస్తుంది. ఈ ఆండ్రోజెన్ స్థాయులను నియంత్రించేందుకు తులసి ఆకులు తోడ్పడతాయి. తెల్లవారు జామున ఖాళీ కడుపుతో 10-12 తులసి ఆకులను నమిలి తినండి. అలాగే వీలైన వరకు తులసి ఆకులు నానపెట్టిన నీళ్లను కూడా త్రాగండి.

తేనె మరియు నిమ్మపండు

PCODకు ముఖ్య కారణం స్థూలకాయం. తేనె మరియు నిమ్మరసాన్ని తీసుకోవటం వలన మీ బరువు తగ్గుతుంది. రెండు స్పూన్ల తేనె మరియు ఒక నిమ్మపండు రసాన్ని ఒక గ్లాస్ వెచ్చని నీటిలో కలుపుకొని తెల్లవారు జామున ఖాళీ కడుపుతో తాగాలి. ఇది మీ బరువు తగ్గించి PCODని నియంత్రించేందుకు తోడ్పడుతుంది.

ఆమ్లా

ఆమ్లాలో విటమిన్ సి మరియు యాంటీ-ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను తగ్గించేందుకు మరియు మహిళల్లో సంతానోత్పత్తి పెంచటానికి సహాయపడుతుంది. ఇందులోని డీటాక్సిఫయింగ్ లక్షణాలు బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

ఆమ్లాలలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తినండి. లేదా ఒక గ్లాస్ నీటిలో తురిమిన ఆమ్లాలను వేసుకొని రాత్రి పడుకునే ముందు త్రాగండి. ఇది మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

కాకరకాయ

కాకరకాయ రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా ఇది PCOD యొక్క లక్షణాలను కూడా తొలగించగలదు. వీటిని మీ రోజూ ఆహారంలో చేర్చుకోండి. లేదా కాకరకాయ ఫల రసాన్ని త్రాగండి.

ఆపిల్ సీడర్ వినిగర్

ఇది మన ఆరోగ్యంపై గొప్ప ప్రభావాలను చూపుతుంది. PCOD సమస్య తొలగించేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల వినిగర్‌ను ఒక గ్లాస్ వెచ్చని నీళ్లలో కలుపుకొని రోజూ 3 సార్లు; తెల్లవారు జామున ఖాళీ కడుపుతో, మధ్యాహ్నం భోజనం ముందు ,మరియు రాత్రి డిన్నర్ తినే ముందు త్రాగండి.

చేస్ట్ బెర్రీ

చేస్ట్ బెర్రీ శరీరంలోని హార్మోన్ స్థాయులను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడటం ద్వారా PCODకు సంబంధించిన సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.

చేస్ట్ బెర్రీ టీని క్రమం తప్పకుండా త్రాగండి. ఈ టీని తయారు చేసేందుకు ఒక స్పూన్ ఎండిన చేస్ట్ బెర్రీలను ఒక కప్పు నీటిలో 8-10 నిమిషాల పాటు ఉడికించండి. తరువాత వడగట్టి వెచ్చగా ఉన్నప్పుడే త్రాగండి.

లికోరైస్

లికోరైస్ వేర్లు ‘ టెస్టోస్టెరాన్‌’ల స్థాయిని తగ్గించగలదని నమ్మకం. టెస్టోస్టెరాన్లను తొలగించటం ద్వారా PCODను నయం చేయడానికి చాలా ప్రభావితమైనది. ఇది అండోత్సర్గమును కూడా పెంచుతుంది. ఎండిన లికోరైస్ వేర్లను నీలల్లో వేసి 10-15 నిమిషాల పాటు ఉడికించి, వడగట్టి త్రాగండి.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉన్నాయి. ఇది శరీరంలోని ఆండ్రోజెన్ స్థాయిని తగ్గించి ఇన్సులిన్ ని పెంచుతుంది. ఫిష్ ఆయిల్ మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన PCOD వ్యాధిని తగ్గించేందుకు సమర్థవంతంగా పని చేస్తుంది.

జీవనశైలి మరియు ఆహార మార్పులు

PCOD చికిత్సలో మీ జీవనశైలి మరియు ఆహార మార్పులు చాలా ముఖ్యమైనవి. ఉత్తమ ఫలితాలను పొందేందుకు గృహ నివారణ పద్దతులతో పాటు ఈ చిట్కాలను కూడా అనుసరించండి.

  • మీ రోజువారీ క్రమంలో వ్యాయామాలను చేయండి. ఇది మీ బరువు తగ్గించేందుకు మరియు PCOS చికిత్సకు తోడ్పడుతుంది.
  • ఆహార నియమం కూడా చాలా అవసరం. మీ బరువు తగ్గటానికి తోడ్పడే ఆహారాలను తినండి. ఉదాహరణకు ఆకుకూరలు, పళ్ళు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలు.
  • ధూమపానం వలన ఆండ్రోజెన్ స్థాయులు అధికరిస్తుంది. మీకు ధూమపానం అలవాటు ఉంటే వెంటనే ఆపడం మంచిది.
  • PCOD ఉన్నప్పుడు మద్యం సేవించడం మంచిది కాదు. ఇది మీ బరువు పెంచగలదు.
  • యోగాసనాలు PCOD సమస్యను తొలగించేందుకు తోడ్పడుతుంది. కానీ వీటిని సరియైన గురువుల దగ్గర నేర్చుకోవాలి.