Chicken soup recipe in Telugu – చికెన్ సూప్ రెసిపీ

చలి కాలంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ‘చికెన్’. అందులోనూ సూప్ ని డిన్నర్ స్పెషల్ గా తీసుకుంటారు. మరి కొన్ని వెజిటేబుల్స్ ని జోడించి ఎంతో యమ్మీ మరియు ఆరోగ్యకరమైన చికెన్ క్లియర్ సూప్ ఎలా చేయాలో తెలుసుకుందామా?

కావలసిన పదార్థాలు

  • బే లీఫ్ – 1
  • లవంగాలు – 5  లేదా 6
  • ఏలకులు- 3
  • మిరియాలు – కొన్ని  (1 స్పూన్)
  • ధనియాలు – కొన్ని (1 స్పూన్)
  • వెలుల్లి – 5 ముక్కలు
  • అల్లం – 3 లేదా 4 చిన్న ముక్కలు
  • కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు – 2
  • కట్ చేసుకున్న క్యారట్ – 1
  • కట్ చేసుకున్న క్యాబేజీ – 1/2 కప్పు
  • కట్ చేసుకున్న ఉల్లిపాయ – 1
  • చికెన్ బోన్స్ – 1 బౌల్
  • నీరు – 1 లీటర్
  • ఉప్పు
  • బోన్ లెస్ చికెన్ – 1 కప్పు
  • కొత్తిమీర
  • నిమ్మరసం – 1 స్పూన్

తయారు చేసే విధానం

  • స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ ఉంచి అందులో బే లీఫ్, లవంగాలు, ఏలకులు, మిరియాలు, ధనియాలు, వెలుల్లి, అల్లం, కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు, కట్ చేసుకున్న క్యారట్, కట్ చేసుకున్న క్యాబేజీ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, చికెన్ బోన్స్, 1 లీటర్ నీరు మరియు 1 టీ స్పూన్ ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ప్రెషర్ కుక్ చేయండి.
  • ఆ తరువాత నీటిని వడగట్టి అందులో 1 టీ స్పూన్ ఉప్పు, బోన్ లెస్ చికెన్ వేసి 15 నిమిషాల పాటు కుక్ చేయండి.
  • బాగా ఉడికిన తరువాత కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేయండి. ఇందులో ఇదివరకే ఉడికించిన వెజిటేబుల్స్ ని జోడించుకోవచ్చు.
  • ఎంతో రుచికరమైన ‘చికెన్ సూప్’ రెడీ.