మసాజ్ తో సుఖ సంసారం..

బిజీ బిజీ ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా చేతినిండా పనితో అలసి సొలసిన మన శరీరాలకు కాస్త ఎదో ఓ మసాజ్ చేయించుకుని కాస్త బడలిక నుంచీ బయటపడదామనుకుంటే రాత్రి ఎప్పుడో వచ్చి మల్లీ ఏ మసాజ్ సెంటర్ కు వెళ్తాంలే అనుకోవటం సహజమే. నేడు భర్తే కాదు భార్య సైతం ఏదో ఓ ఉద్యోగమో, వ్యాపారమో లేక ఇంటిడు చాకిరీ చేసో అలసిపోవటం సహజమైపోయింది. కానీ ఇంతా చూస్తే ఒకరికొకరు తమ బడలికను వ్యక్తపరచలేకపోవటం, ఒకవేళ చెప్పుకున్నా ఆ సమయము ఆ ఓపికా తీరికా లేకపోవటం జరుగుతుంది. అయితే భార్యభర్తలిరువురూ ఒకరికొకరు మసాజ్ చేసుకుంటే చాలా వరకూ బడలిక తగ్గి ఎంతో పునరుత్సాహాన్ని పొందుతారని నిపుణులంటున్నారు.

ఇలా చేయటం వల్ల ఇరువురిలో పునరుత్సాహం నిండటమే కాకుండా అన్యోన్యత కూడా పెరుగుతుందనీ విశ్లేషకులంటున్నారు.

1. పని ఒత్తిడితోపాటు ఉన్నట్లుండి మెడ పట్టేయడం జరుగుతుంది. ఆ సమయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే దాన్ని సరిచేయాలంటే చక్కగా మసాజ్ చేయించుకుంటే ఆ బాధ నుండి బయటపడవచ్చు.

2. వీపు, నడుము తదితర శరీర భాగాలు ఒక్కోసారి నొప్పి పెట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇక పని వత్తిడి ఎక్కువ వుంటే ఆ బధ మరింతగా ఉంటుంది. ఇక ట్రావెల్ చేసే వారి పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించడానికి శరీరాన్ని మసాజ్ చేయించుకోవాలి. అలా మసాజ్ చేయించుకోవటం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు.

3. మసాజ్ టెక్నిక్స్‌ను తెలుసుకుని నైపుణ్యంతో మసాజ్ చేసుకుంటే ఉత్తమ ఫలితముంటుంది. ఈ టెక్నిక్స్ ను ఫాలో అవటం వల్ల శరీరంలో ఒత్తిడికి గురైన అన్ని భాగాలు మసాజ్ మధురానుభూతిని పొంది రిలాక్స్ అవుతాయి.

4. ముఖ్యంగా కణతలు రోజంతా వత్తిడికి గురై చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే కనుబొమ్మలు, నుదురు, మెడ, భుజాలు, వెన్ను, నడుము, మోకాళ్లలో నిక్షిప్తమై ఉన్న టెన్షన్ అంతా మసాజ్‌తో మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు.