Aloo pyaz paratha recipe in Telugu – ఆలూ ప్యాజ్ పరోటా రెసిపీ

నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధమైన ఆలూ పరోటా ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో కూడా ప్రతి హోటల్ మరియు రెస్టారెంట్స్ లో లభిస్తోంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆలూ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • గోధుమ పిండి – 1 కప్పు
  • మైదా – 1 కప్పు
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • నూనె
  • తరిగిన పచ్చి మిర్చిలు – 2
  • కస్తూరి మేతి – 1 టీ స్పూన్
  • సోంపు – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • వెన్న

తయారు చేసే విధానం

  • ముందుగా బంగాళదుంపలను ఉడికించి తోలు తీసి రెడీ గా ఉంచుకోవాలి.
  • ఒక పెద్ద బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలపాలి.
  • పిండికి తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • మరో బౌల్ లో ఉడికించిన బంగాళదుంపలను బాగా మాష్ చేసి అందులో 2 తరిగిన పచ్చి మిర్చిలు, 1 టీ స్పూన్ కస్తూరి మేతి, 1 టీ స్పూన్ సోంపు, 1 తరిగిన ఉల్లిపాయ మరియు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటే ఆలూ స్టఫ్ రెడీ.
  • ఇప్పుడు చపాతీ పిండిని చపాతీ కర్రతో రౌండ్ షేప్ లో చేసుకొని మధ్యలో ఆలూ ని పెట్టి స్టఫ్ చేసి చిన్న పరోటా సైజుకి వచ్చేలా చేసుకోవాలి.
  • స్టవ్ పై చపాతీ తవా ఉంచి బటర్ రాసి పరోటాను రెండు వైపులా కుక్ చేసుకుంటే వేడి వేడి ఆలూ ప్యాజ్ పరోటా రెడీ!