Chicken vada recipe in Telugu – చికెన్ వడ రెసిపీ

చికెన్ వడ! నాన్ వెజిటేరియన్ ఇష్టపడేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ టీ టైం స్నాక్స్. ఎంతో రుచికరమైన ఈ స్నాక్స్ ప్రత్యేకంగా వానా కాలంలో నోరూరిస్తుంది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు మరియు చేసే విధానం తెలుసుకుందాం.

 

కావలసిన పదార్థాలు

  • బోన్ లెస్ చికెన్
  • శనగ పిండి – 1/3 కప్పు
  • ఉల్లిపాయలు – 1 కప్పు
  • పచ్చి మిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్
  • కొత్తిమీర – 1/2 గుత్తి
  • ఊరబెట్టిన శనగలు – 2 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • బ్లాక్ పెప్పర్ – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1/4 టీ స్పూన్
  • ఉప్పు
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా బోన్ లెస్ చికెన్ ని బాగా శుభ్రం చేసి గ్రైండర్ లో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి.
  • 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ చికెన్ పేస్ట్‌ను ఒక బౌల్ లో తీసుకొని అందులో 1/3 కప్పు శనగ పిండి, 2 టీ స్పూన్ ఊరబెట్టిన శనగలు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చి మిర్చి, 1/2 గుత్తి తరిగిన కొత్తిమీర, 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు మరియు 1 టీ స్పూన్ పచ్చి మిర్చి పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • కలిపి ముద్దలా చేసుకున్న తరువాత అందులో రెండు స్పూన్ నూనెని వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత పిండి చేతికి అంటకుండా ఉండేందుకు నూనె రాసుకొని చిన్న చిన్న కట్లెట్స్ లాగా రౌండ్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై పాత్రలో నూనెని వేడి చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే వేడి వేడి చికెన్ వడలు తయారు!