Poha / Murmura upma recipe in Telugu – ముర్మురు ఉప్మా రెసిపీ

రాయలసీమలో ఎంతో ప్రసిద్ధమైన అల్పాహారం ఉగ్గాని. ఇది ఎంతో లైట్ వెయిట్ టిఫిన్. దీనిని టీ టైం స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. దానినే ‘ముర్మురా ఉప్మా’ అని కూడా అంటారు. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఉప్మా ని బొరుగులతో తయారు చేస్తారు. ఎంతో తక్కువ సమయంలో రుచికరమైన ఉగ్గాని (ముర్మురా ఉప్మా) ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 2 టేబుల్ స్పూన్
  • శనగ పిండి – 2 టేబుల్ స్పూన్
  • వేరుశనగలు – 2 టేబుల్ స్పూన్
  • ఎండు మిరపకాయలు – 3
  • కరివేపాకు – 1 గుత్తి
  • నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
  • చిన్నగా తరిగిన పచ్చి మిర్చి
  • తురిమిన టమోటా – 1
  • తురిమిన ఉల్లిపాయలు – 2
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • బొరుగులు – 1 కప్పు
  • శనగలు – 2 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక కప్పు బొరుగులలో నీళ్లు పోసి మట్టి పదార్థాలు లేకుండా కడిగి 5 నిమిషాల పాటు నీటిలో నానపెట్టాలి.
  • ఆ తరువాత నీటిని బాగా పిండి బొరుగులను ఒక బౌల్ లో వేసుకొని 2 టీ స్పూన్ శనగ పిండిని వేసి బాగా కలుపుకోవాలి.
  • స్టవ్ పై పాన్లో 2 టీ స్పూన్ నూనెని హీట్ చేసి 2 టీ స్పూన్ వేరుశనగలను దోరగా వేయించి సగం శనగలను ఒక బౌల్ లో తీసుకోవాలి.
  • మిగిలిన వేరుశనగలతో పాటు 2 టీ స్పూన్ శనగలను వేసి దోరగా వేయించాలి.
  • అందులో పచ్చి మిరపకాయలు, 1 గుత్తి కరివేపాకులు, తరిగిన పచ్చి మిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
  • తరువాత అందులో 2 తురిమిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేయాలి.
  • ఉల్లిపాయలు బాగా కుక్ అయిన తరువాత 1 టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 తరిగిన టమోటో వేసి బాగా కలపి ఫ్రై చేయాలి.
  • టమోటా బాగా ఉడికిన తరువాత నీటిలో ఊరబెట్టి తయారుగా ఉంచుకున్న బొరుగులను అందులో వేసి బాగా కలపాలి.
  • చివరిగా రుచి కోసం 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి మనం ఫ్రై చేసి విడిగా ఉంచిన వేరుశనగలను వేసుకుంటే ఎంతో రుచికరమైన ఉగ్గాని (ముర్మురా ఉప్మా) తయారు!