Potato and tomato curry recipe in Telugu – ఆలూ టమాటో సబ్జి రెసిపీ

చపాతీకి ఎన్ని రకాల సైడ్ డిషెస్ ని మనం తయారు చేసుకున్నా సరే బంగాళదుంపలతో చేసేటువంటి కర్రీస్ కి సాటి ఏదీ లేదు. నార్త్ ఇండియాలో బంగాళదుంపలతో చేసే వంటలు ఎంతో ప్రసిద్ధి. అందులో ఒకటి ఆలూ సబ్జి. ప్రస్తుతం మన దక్షిణ భారత దేశంలో కూడా ఎంతో మందికి ఫేవరెట్ డిష్ ఇది. మరి ఇంట్లో సులభంగా ఆలూ టమాటో సబ్జిని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్
  • ఆవాలు
  • శనగ పప్పులు – 1 స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • తరిగిన పచ్చి మిర్చి – 2
  • కరివేపాకులు – 10
  • తరిగిన బంగాళదుంపలు – 2
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 2 చిటికెలు
  • తరిగిన టమోటాలు – 2
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా – 2 చిటికెలు
  • కొత్తిమీర

తయారు చేసే విధానం

  • స్టవ్ పై ప్యాన్ ఉంచి 4 లేదా 5 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, కొద్దిగా శనగ పప్పులు వేసుకోవాలి.
  • శనగ పప్పులు కుక్ అయిన తరువాత 1 తరిగిన ఉల్లిపాయ, 2 తరిగిన పచ్చి మిర్చి, 10 కరివేపాకులు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి.
  • తరువాత 2 తరిగిన బంగాళదుంపలు వేసి ఫ్రై చేయాలి.
  • 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 చిటికె పసుపు పొడి వేసి 5 నిమిషాలు ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు అందులో 2 తరిగిన టమోటాలు వేసి బాగా కలిపి టమోటాలు బాగా కుక్ అవ్వడానికి మూతవేసి 6 నిమిషాల పాటు కుక్ చేయండి.
  • మూత తీసి టమోటా బాగా ఉడికిన తరువాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 చిటికెల గరం మసాలా వేసి బాగా కలపాలి.
  • ఆ తరువాత 250 మి.లీ నీళ్లను పోసి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ సబ్జి తయారు!