Rava chilla / Suji ka cheela recipe in Telugu – రవ చిల్ల / సుజి కా చీలే రెసిపీ

చీలా అంటే రవ లేదా శనగ పిండితో చేసేటువంటి ఫ్యాన్ కేక్స్. వీటిని బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకుంటారు. ఎంతో సులువైన మరియు రుచికరమైన రెసిపి. మరి ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • రవ – 2 కప్పులు
  • పెరుగు – 1 కప్పు
  • ఉప్పు – 2 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 2
  • తరిగిన టమోటాలు – 2
  • తురిమిన పన్నీర్ – 1 కప్పు లేదా 100 గ్రాములు
  • తరిగిన పచ్చి మిర్చి – 1
  • నెయ్యి – 50 గ్రాములు

తయారు చేసే విధానం

  • ఒక పెద్ద బౌల్ లో 2 కప్పుల రవ, 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అందులో తగినన్ని(3 లేదా 4 స్పూన్) నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 2 తరిగిన ఉల్లిపాయలు, 2 తరిగిన టమోటాలు, 1 కప్పు లేదా 100 గ్రాములు తురిమిన పన్నీర్ మరియు 1 తరిగిన పచ్చి మిరపకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని సిద్ధం చేసుకోవాలి. పిండి మరీ నీళ్ళుగా లేదా గట్టిగా ఉండకూడదు.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక తవా లేదా ఫ్యాన్ ని ఉంచి నెయ్యి రాసి తయారు చేసుకున్న పిండిని దోసలా పోయాలి.
  • చుట్టూ నెయ్యి రాసి బాగా కుక్ అయిన తరువాత మరో వైపు నెయ్యి రాసి వేడి చేయాలి.
  • అంతేనండి వేడి వేడి ‘సుజి కా చీలే’ రెడీ!