మీ చర్మం పై ట్యాన్ ను తొలగించాలంటే? – Tan removal tips in Telugu

సూర్యుని కాంతికి చర్మం కందిపోయి పాడయిపోవటం చాలా మందికి కలిగే సమస్య. ఇది చర్మాన్ని డార్క్ గా చేయటమేకాకుండా డజను సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిలో ముఖ్యంగా చర్మంపై ప్యాచులు పడటం, ర్యాషెస్ రావటం, చర్మం సాగుదలకు గురి అవ్వటం లాంటివి జరుగుతాయి. అంతేకాక ఇది మీ చర్మాన్ని డార్క్ గానూ, మీ చర్మం నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి.
కొన్ని సరియైన సన్ స్క్రీన్ లోషన్లు వాడినా, ఎన్నిసార్లు పార్లర్లకు తిరిగినా, మరెన్నో జాగ్రత్తలు తీసుకున్నా మీరు ఈ చర్మం కందిపోవటం అంటే ఆంగ్లంలో టాన్ అవ్వటం మాత్రం మామూలే. ఎందుకంటే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సూర్యుని కాంతి వల్ల మీ చర్మం రక్షింపబడుతుందా? ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి. మీ చర్మం ఎండ ధాటికి ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే. అందుకే ఇక్కడ మీకు కొన్ని టిప్స్ ని అందిస్తున్నాం. అయితే ఈ టిప్స్ కోసం మీరు ఎక్కడెక్కడికో పరుగిడాల్సిన అవసరం లేదు.. అవి ఎక్కడో కాదు మీ వంట ఇంట్లోనే దొరుకుతాయి. వీటిని వాడటం వల్ల మీరు చక్కని ఫలితాలనే పొందగలరు. కాబట్టి మేము చెప్పే చిట్కాలను మీరు టీవి చూస్తూ, నెట్ చేసుకుంటూ, నిద్రిస్తూ కూడా ఆనందించవచ్చు.

నిమ్మ, గులాబీ, దోస

నిమ్మ, గులాబీ, దోస ఇవి మీ చర్మం పై ట్యాన్ ను చాలా చక్కగా తొలగిస్తాయి. ఈ మూడింటినీ సమ పాళ్ళల్లో ఒక బౌల్ లో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. మీ ముఖానికే కాక మీ మెడ వరకూ పెట్టుకోండి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మ రసం సన్ ట్యాన్ ను తొలగిస్తుంది. ఇక రోజ్ వాటర్, దోస చర్మం మృదువుగా మారేలా చేస్తాయి.

తేనె, నిమ్మ ఫేస్‌ప్యాక్

తేనె, నిమ్మ ఫేస్‌ప్యాక్ మీ చర్మంపై ట్యాన్ తొలగించేందుకు ఉపయోగపడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకూ వేసుకోవాలి. ప్రత్యేకంగా చర్మం కంది మచ్చలు ఏర్పడిన చోట తప్పకుండా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. నిమ్మ ఒక సహజసిధ్ధ బ్లీచింగ్ అయితే, తేనె చర్మాన్నిమృదువుగా చేస్తుంది. చర్మం చక్కగా ఉండేలా చేస్తుంది.

కొబ్బరినీళ్ళు

కొబ్బరి నీళ్ళు కేవలం మీ దాహాన్ని తీర్చటమే కాదు మీ ముఖంపై ఉన్న ట్యాన్ మచ్చల్ని తొలగిస్తుంది. మీ చర్మాన్ని సూర్య కాంతి నుంచీ కందిపోకుండా చూస్తుంది. మీరు రోజూ కనక మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు రాసుకోవటం వల్ల ఎంతో మంచిది. దీని వల్ల మీరు రోజు రోజుకీ చక్కగా ఫైర్ గా తయారవుతారు.

టొమాటో, నిమ్మ రసం, పెరుగు ఫేస్‌ప్యాక్

2 టేబుల్ స్పూన్స్ టొమాటో గుజ్జు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ చర్మం ఎక్కడైతే బాగా కంది మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ రాసుకోండి. 25-30 నిముషాలు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.ఈ ప్యాక్ వల్ల మీ చర్మం చక్కగా తయారవ్వటమేకాక మీ చర్మం పిగ్మెంటేషన్ కు గురి కాకుండా చేస్తుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే దీనిలో టొమాటో ఉండటం వల్ల కాస్త దురద గా అనిపిస్తుంది.. కాసేపటికి మామూలు అవుతుంది.

పసుపు, నిమ్మ రసం

4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పసుపు ఒక బౌల్ వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలపై రాసుకోవాలి. 30 నిముషాలు ఆరాక వాష్ చేసుకోవాలి. మీ చర్మం చక్కగా తెల్లగా చేస్తుంది. నిమ్మ బ్లీచ్ గా ఉపయోగపడితే, పసుపు యాంటీబయటిక్ గా ఉపయోగపడుతుంది.

గింజలు మరియు ఆయిల్స్ మిశ్రమం

4 టెబుల్ స్పూన్స్ నువ్వుల గింజల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి ముఖానికి రాసుకోవాలి. తర్వాత స్క్రబ్ గా శనగపిండిని వాడాలి. ఇది మీ చర్మంపై అద్భుతాన్నిచేస్తుంది. మృత చర్మాన్ని తొలగిస్తుంది. దీనిని రోజూ వాడితే మీ చర్మం పై చక్కగా పని చేస్తుంది.

బొప్పాయి, పాలు

బొప్పాయి గుజ్జును, పాలు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలలో రాసుకోవాలి. పూర్తిగా ఆరేంత వరకూ ఆగి తర్వాత వాష్ చేసుకుని చూడండి. ఎంతో అద్భుతమైన ఫలితాల్ని చూస్తారు.

Subscribe to Blog via Email

Join 9,531 other subscribers

బంగాళదుంపల్ని వాడండి

బంగాళాదుంప చర్మంపై చక్కగా పని చేస్తుంది. స్లైసెస్ గా కోసుకుని ముఖంపై రాసుకోవటం వల్ల ట్యాన్ అయిన చోట మళ్ళి చర్మం సరి అవుతుంది. కొద్ది నిముషాలు ఉండి తర్వాత వాష్ చేసుకోండి. తర్వాత మీరే చుసుకోండి తేడాని. మీరు బంగాళాదుంప జ్యూస్ ని కూడా రాసుకోవచ్చు. ఈ రసానికి నిమ్మ రసం కాస్త కలుపుకుని రాసుకుంటే మంచిది. మంచి ఫలితాలుంటాయి.

పాలు, కుంకుమ

ఈ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది మెలనిన్ సింథెసిస్ ను తగ్గిస్తుంది. మెలనిన్ సింథెసిస్ వల్ల ట్యాన్ ఎక్కువగా అవుతుంది. 4-5 తంతువుల కేసర్ ను పాలల్లో 30 నిముషాలపాటూ నానపెట్టుకోవాలి. ఈ సొల్యూషన్ ని 5 నిముషాలపాటు ముఖం పై ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

పాలు, దోస, నిమ్మ

మీకు కనక ఈ సమస్య ఎక్కువగా ఉంటే వీటి వాడకం వల్ల చక్కగా తగ్గిపోతుంది. ఫ్రెష్ దోస జ్యూస్ ను తీసుకుని 1 టేబుల్ స్పూన్ దోస జ్యూస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పాలు, 3-4 నిమ్మ రసం చుక్కల్ని కలుపుకోవాలి. 5 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత చల్లని వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ముల్తాని మట్టి, రోజ్ వాటర్

ముల్తాని మట్టి సహజసిధ్ధమైన మూలికలతో నిండి ఉంటుంది. ఇది మీ ముఖం మీద ఉన్న ట్యాన్ ను సమర్ధవంతంగా తొలగిస్తుంది. రోజ్ వాటర్ మీ ముఖం చక్కగా ప్రకాశవంతంగా జీవంతో కూడి ఉండేలా చేస్తుంది. ఒకవేల మీది పొడి చర్మం అయితే మీ చర్మం చక్కగా ఆయిలీ తత్వాన్ని చక్కగా అలవడేలా చేస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ ముల్తాని మట్టిని రోజ్ వాటర్ లో నానపెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్నిముఖానికి రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది చక్కని ఫలితాల్ని ఇస్తుంది.