చిన్నపిల్లల్లో పులిపిరుల సమస్యా?

చాలామంది పిల్లలకి పులిపిరి కాయల సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలియని పరిస్తితి ఉంటుంది. పులిపిరులు ఎందుకు వస్తాయి? వాటిని నివారించుకోవటం ఎలా అని చాలా సతమతమవుతుంటారు. ఏదిఏమైనా వాటి రాకకు మాత్రం కారణాలు ఉండవు. చర్మంపై వచ్చి కాస్త ఇబ్బందిని కలిగిస్తూ నానాటికి వ్యాప్తి చెందే పులిపిరుల గురించి అవగాహన ఎంతైనా అవసరం. అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందామా..

ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి.  ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం.

Sleeveless Blouse designs

ఈ వ్యాధి వ్యాప్తి జరిగే తీరు :

1. చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్  ఇనాక్యులేషన్ అంటారు.

2. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ  లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే… బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.

చికిత్స విధానం :

1. ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయించుకోవచ్చు.

2. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

Subscribe to Blog via Email

Join 9,403 other subscribers

3. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి.