అరటి పండును ఇష్టపడని వారుండరు. భోజనానంతరం పండు తినే అలవాటు అదీ అరటిపండు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కొందరు దీనిని స్నాక్స్ గా కూడా ఉపయోగిస్తారు. అయితే అరటిపండు చేసే మేళ్ళు ఎక్కువేనన్న విషయం చాలామందికి తెలేది. అరటిపండంటే విరివిగా దొరుకుతుందని కాస్త చవక అని భావిస్తుంటారు. కాని మన సౌందర్యం ఇనుమడించాలంటే అరటి చేసే మేళ్ళెన్నో అన్న విషయాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు. అవెంటో తెలుసుకుందామా..
1. అరటిపండు గుజ్జులో స్పూను తేనె , లేదా స్పూను పచ్చి పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి . అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఈ విధంగా 20 నుండి 25 రోజుల పాటు చేసినట్టయితే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది .
2. బాగా మిగల మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్లు గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి . ముఖం , మెడకు పట్టించి బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ చిట్కా వలన ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది .పొడి చర్మం వారు ఈ విధంగా చేయాలి .
3. అరటిపండు గుజ్జులో గుడ్డు లోని తెల్ల సోన , ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ జత చేసి బాగా కలిపి ముఖం , మెడకు పట్టించి ఆరనివ్వాలి . అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లు చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు .
4. అరటిపండు గుజ్జులో టేబుల్ స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి .ముఖం మీద మచ్చలతో భాదపడే వారు ఈ విధంగా చేయటం మంచిది .
5. అరటి పండు తొక్కతో మచ్చలున్న ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ పావు గంట సేపు ఆరనివ్వాలి . అనంతరం ముఖాని శుభ్రంగా కడుక్కోవాలి .రోజు మొత్తం మీద వీలయినన్ని సార్లు ఈ విధంగా చేసినట్టయితే మచ్చలు క్రమేపీ మాయం అవుతాయి .
6. పళ్ళు పసుపు పచ్చగా మారుతుంటే అరటి తొక్కతో పళ్ళ మీద బాగా రుద్దాలి .రోజులో కనీసం రెండు సార్లు ఈ విధంగా చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొదవచ్చు.