గర్భిణులకు ‘ యోగ ‘

మీరు గర్భం ధరించబోతున్నారా..! అయితే ఖచ్చితంగా మీరు యోగా చేస్తే మంచిది. కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం సాధారణం. అయితే వీటికి చికిత్స చేయకుండా వదిలేయడం వల్ల తల్లీబిడ్డలకు హాని చేకూరే అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీబిడ్డలు బరువు కోల్పోవడం, ప్రీ-ఎక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్పు కావడం వంటివి సంభవించవచ్చు.

ఇప్పుడు ఇతర దేశాల పరిశోధనల్లో సైతం యోగా గురించి ఒక అంశం వెలుగుచూసింది ఈ నిజమే. గర్భం ధరించిన యువతుల్లో అనేక హార్మోన్ల మార్పుల వల్ల భావోద్వేగాల మార్పులు (మూడ్ స్వింగ్స్) సాధారణం. అయితే ప్రతి ఐదుగురు గర్భవతుల్లో ఒకరిలో ఈ మార్పు తీవ్రంగా కనిపిస్తుంది. మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ మూడ్ స్వింగ్స్‌కు ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపిస్తోంది. ఇలాంటి వారిలో ఒత్తిడిని ఎంతగా తగ్గించగలిగితే, మూడ్ స్వింగ్స్ తీవ్రత అంతగా తగ్గుతుందని పరిశోధక బృందం తెలుసుకుంది.

మూడ్ స్వింగ్స్ కారణంగా కలిగే డిప్రెషన్ లక్షణాల (డిప్రెసివ్ సింప్టమ్స్)ను నివారించేందుకు ఒత్తిడిని తొలగించేలా స్ట్రెస్‌బస్టర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న మారియా ముజిక్, ‘‘భారతీయుల యోగా మంచి స్ట్రెస్‌బస్టర్ అని తేటతెల్లమైది. అయితే మా వద్ద దీన్ని ససాక్ష్యంగా నిరూపించేలా పరిశోధన ఫలితాలేమీ లేవు. దాంతో అధ్యయన ఫలితాలను రికార్డు చేసే పనిని చేపట్టాం. ఇప్పుడు గర్భవతులు అనుసరించదగిన ఆరోగ్యకరమైన, సురక్షితమైన యోగా ప్రక్రియలతో అటు తల్లికి, ఇటు బిడ్డకు మేలు జరుగుతుందని మా అధ్యయనంలో తేలింది’’ అని పేర్కొన్నారు.

గర్భవతులు పాటించదగిన సురక్షితమైన యోగా ప్రక్రియలు:

గర్భిణీ సమయంలో కలిగే దుష్పరిణామాలను నివారించడమే గాక, తల్లీబిడ్డలకు మధ్య ప్రేమానురాగాలను మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్ పేర్కొన్నారు. పైలట్ స్టడీ రూపంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో 12-26 వారాల గర్భిణులు రోజూ 90 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను చాలా సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలి.

NO COMMENTS