గర్భవతి స్త్రీలు కుంకుమపువ్వును ఎప్పుడు ఎలా తీసుకోవాలి? – How / when to take saffron (kesar) during pregnancy in Telugu

కుంకుమపువ్వును ఎక్కువగా గర్భవతి స్త్రీలు తీసుకుంటారు. స్త్రీలు గర్భధారణ సమయంలో కుంకుమపువ్వును తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి విముక్తి పొందగలరు. కుంకుమ పువ్వు తీసుకోవడం అనేది గర్భవతి స్త్రీలకు చాల సురక్షితం. దీనిని భారతదేశపు వంటకాలలో మసాలాగా భావిస్తారు. దీనిలో అనేక రకాలైన మంచి లక్షణాలు ఉన్నవి. కొన్ని సంవత్సరాలుగా కుంకుమ పువ్వును దెబ్బలను, గాయాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీనిని గర్భాశయ ఉద్దీపనకు కూడా ఉపయోగిస్తారు. గర్భవతి స్త్రీలుకు కుంకుమపువ్వును కండరాలను బలపరుచుటకు ఉపయోగపడుతుంది.

కుంకుమపువ్వును ఎందుకు తీసుకోవాలి అంటే?

కుంకుమపువ్వును ఉపయోగించుకోవడానికి చాల కారణాలు ఉన్నవి. ఒక కారణం ఏమిటి అంటే జీర్ణ వ్యవస్థను మంచిగా చేస్తూ ఆకలి ఎక్కువగా వేసేలా చేస్తుంది. గర్భవతి స్త్రీల మనసు చంచల తత్వాన్ని కలిగి ఉంటుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన వారి మనసు నిర్దిష్టంగా మారుతుంది. గర్భవతి స్త్రీల యొక్క రక్త ప్రసరణ కొంచెం సేపు ఎక్కువగా కొంచెం సేపు తక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వలన రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది.

కుంకుమ పువ్వుని ఎప్పుడు తీసుకోవాలి?

గర్భవతి స్త్రీ కుంకుమపువ్వును రెండవ నెల నుంచి తీసుకోవడం మొదలు పెట్టవచ్చు. దీనిని ఉదయాన్నే మరియు సాయంత్రం వేడి పాలతో తీసుకోవాలి. చిటికెడు కుంకుమపువ్వు తీసుకొని ఒక గ్లాస్ పాలల్లో కలవాలి. అప్పుడు మీకు దాని రుచి తెలుస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

కుంకుమపువ్వును కొనాలి అంటే మీరు షాపులో తీసుకునేటప్పుడు చాల జాగ్రత్త వహించాలి. మంచి కుంకుమపువ్వు తీసుకోకపోతే గర్భవతి స్త్రీలకు చాల హానికరం. కనుక షాపుల్లో ఉండే లూస్ కుంకుమ పువ్వు కాకుండా ప్యాక్ చేసి ఉన్న కుంకుమపువ్వు తీసుకోవాలి. ఆ ప్యాక్ మీద ISI గుర్తు కూడా గమనించి గుర్తు ఉంటేనే దానిని తీసుకొని ఉపయోగించాలి.

గర్భవతి స్త్రీ కుంకుమపువ్వు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మంచి రంగుతో అందంగా పుడతారు.

కుంకుమపువ్వు ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరం కనుక చిటికెడు మాత్రమే తీసుకోవాలి. గర్భవతి స్త్రీలు కుంకుమపువ్వు ఎక్కువగా తీసుకోవడం వలన డెలివరీ సమయంలో ఎక్కువగా గర్భస్రావం జరుగుతుంది. కనుక మీరు తక్కువ మోతాదులో తీసుకోవాలి అనగా పాటతో పాటు చిటికెడు మాత్రమే తీసుకోవాలి. కుంకుమ పువ్వు తక్కువగా తీసుకోవడం వలన గర్భధారణలో ఉన్నప్పుడు పిండోత్పత్తి  బాగా జరుగుతుంది. కొందరు నిపుణులు కూడా చెప్పారు 5వ నెలలో కుంకుమపువ్వు తీసుకోవడం చాల మంచిది అని.

ఎక్కువగ గర్భవతి స్త్రీలకు తాగిన పాలు అరుగుదల కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు ఒక చిటికెడు కుంకుమపువ్వుతో తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.

కుంకుమపువ్వు వలన ఉపయోగాలు

కుంకుమపువ్వుని ఎక్కువగా స్వీట్స్, బిరియాని, ఖీర్ మరియు బ్యూటీ క్రీమ్సలలో వాడుతారు. ఇది ఎక్కువగా జీర్ణ వ్యవస్తకు ఆహార అరుగుదలకు ఉపయోగపడుతున్నది. స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకున్నా కుంకుమపువ్వు మంచి మందుగా పనిచేస్తుంది. అంతే కాకుండా పురుషులలో వంధ్యత్వానికి, ఉబ్బసం, అంధత్వం మరియు కాన్సర్ నుంచి కాపాడుతుంది.

Subscribe to Blog via Email

Join 9,491 other subscribers

గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు

కుంకుమపువ్వు మరియు పాలు వలన బేబీ చాల అందంగా పుడుతుంది. గర్భధారణ సమయంలో జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయుటకు ఇది తోడ్పడుతుంది.

 జీర్ణక్రియ

కుంకుమపువ్వు జీర్ణాశయంలో కొత్త పొరను ఏర్పరచి ఆకలిని పెంచుతుంది. ఆహారం తొందరగ జీర్ణం అవడానికి సహాయ పడుతుంది.

కడుపునొప్పి

కుంకుమపువ్వు కడుపునొప్పిని తగ్గించి పాల ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఉన్న యాంటి స్పాస్పోడిక్ ప్రభావం వలన కడుపునొప్పి నిరోధకంగా పనిచేస్తుంది.

రక్తపోటు

చిటికెడు కుంకుమపువ్వు రోజు తీసుకోవడం వలన రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కండరాలను బలంగా ఉంచుతుంది. కుంకుమపువ్వు ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భాశయ ఉద్దీపన జరుగుతుంది.

అందమైన శిశువు కోసం కుంకుమపువ్వు

శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి కుంకుమపువ్వు మరియు పాలు తీసుకోవడం వలన శిశువు మంచి రంగుతో మరియు అందంగా పుడుతుంది. తల్లిదండ్రులు తక్కువ రంగు అయిన కూడా కుంకుమపువ్వు తీసుకోవడం వలన పుట్టబోయే బిడ్డ అందంగా పుడుతుంది.

కంటి సమస్య

కుంకుమపువ్వు తీసుకోవడం వలన దృష్టి లోపం లేకుండా వుంటుంది. గర్భవతి స్త్రీలు తీసుకోవడం వలన తల్లికి మరియు బిడ్డకి ఇద్దరికి ఉపయోగకరం.

మూత్రపిండాలు మరియు కాలేయం

కుంకుమపువ్వు ఆరోగ్యానికి చాల మంచిది. కుంకుమపువ్వు రక్తాన్ని శుద్ది చేస్తుంది. రక్తం శుద్ది చెందటం  వలన మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు రాకుండా ఉంటాయి.