Kala jamun recipe in Telugu – కాలా జామున్ రెసిపీ

భారతదేశంలో ముఖ్యంగా నేపాల్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన స్వీట్ గులాబ్ జామున్. ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎంతో మందికి ఫేవరెట్ స్వీట్ గా మారింది. గులాబ్ జామున్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి రకాన్ని ఒక ప్రత్యేకమైన రుచి మరియు రంగుతో తయారు చేస్తారు. అందులో ఒక రకం కాలా జామున్. మరి ఈ స్వీట్ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పాలు – 1/2 కప్పు
  • ఫ్రెష్ క్రీమ్ – 1/4 కప్పు
  • మిల్క్ పౌడర్ – 1 కప్పు
  • నీళ్లు – 1 కప్పు
  • చక్కెర – 1 కప్పు
  • ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం – 1
  • మైదా – 1/4 కప్పు
  • బేకింగ్ సోడా – 1 చిటికె
  • జామున్ మిక్స్ – 1/2 కప్పు
  • కాజు మరియు పిస్తా – కొన్ని
  • కుంకుమ పువ్వు
  • నెయ్యి/ నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత

తయారు చేసే విధానం

  • ఒక ప్యాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని, 1/2 కప్పు పాలు, 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ మరియు 1 కప్పు మిల్క్ పౌడర్ వేసి 15 నిమిషాలపాటు సన్నటి మంటలో మరిగించాలి.
  • అడుగంటకుండా ఉండేందుకు కలుపుతూ ఉండాలి.
  • అలా 15 నిమిషాల పాటు చేయటం వలన పాలు బాగా మరిగి కోయా తయారవుతుంది.
  • ఇప్పుడు ఒక పాత్రలో 1 కప్పు నీళ్లు మరియు 1 కప్పు చక్కెర వేసి వేడి చేయాలి.
  • చక్కెర కరిగిన తరువాత అందులో 1 టేబుల్ స్పూన్ ఏలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి మూతవేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  • 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేస్తే జామున్ కి కావలసిన చక్కెర పాగు తయారవుతుంది.
  • ఇప్పుడు ఇంకొక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి ఒక లీటర్ పాలు పోసి అందులో 1/2 కప్పు నిమ్మ రసం కలపాలి.
  • నిమ్మ రసం కలిపిన పాలను వేడి చేయటంవలన పాలు విరుగుతుంది.
  • పాలు పూర్తిగా విరిగిన తరువాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని నీటిని వడగట్టండి.
  • నిమ్మరసం యొక్క పుల్లని రుచి పోవడానికి విరిగిన పాలను నీటితో శుభ్రం చేసి నీటిని బాగా పిండి ఒక బౌల్ లోకి వేసుకోండి.
  • ఆ విరిగిన పాలను చేతితో బాగా కలిపి పిండి ముద్దులా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులో కోయా, 1/4 కప్పు మైదా, 1 చిటికెడు బేకింగ్ సోడా, 1 స్పూన్ నీళ్లు లేదా పాలు వేసుకొని బాగా కలుపుకుంటే జామున్ మిక్స్ తయారవుతుంది.
  • ఈ జామున్ మిక్స్ నుండి ఒక 1/2 కప్పు మిక్స్ ను విడిగా తీసుకొని అందులో పిస్తా, కాజు మరియు కుంకుమ పువ్వు నానబెట్టిన నీటిని వేసుకొని బాగా కలపాలి.
  • ఆ తరువాత మిక్స్ చేసి ఉంచుకున్న ఈ జామున్ ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి.
  • ఆ తరువాత స్టఫ్ చేయాలి. అందుకు మనం ఇంతకుముందు విడిగా ఉంచిన 1/2 కప్పు జామున్ మిక్స్ ని తీసుకొని ఆ మిక్స్ ని రౌండ్ షేప్ గా తట్టి, అందులో బాల్స్ చేసిన జామున్ ని ఉంచి బాల్ షేప్ లో తయారు చేసుకోవాలి.
  • అలా అన్నింటినీ చేసుకున్న తరువాత ఒక ప్యాన్ లో డీప్ ఫ్రై చేయడానికి సరిపడే నెయ్యి లేదా నూనెని వేసుకొని ఈ బాల్స్ ని ఫ్రై చేయాలి.
  • బాగా ఫ్రై చేసిన తరువాత ఆ బాల్స్ ని చక్కెర పాగులో వేసుకోవాలి.
  • జామున్ సాఫ్ట్ గా అయ్యే వరకు నానాలి.
  • అంతేనండి తియ్యని రుచికరమైన కాలా జామున్ రెడీ!