పెదవులు పగిలి ఇబ్బంది పడుతున్నారా?

అమ్మాయిల అందం అనగానే గుర్తొచ్చేది పెదవులు. చక్కటి పెదవులు అందాన్ని ఇనుమడింపచేస్తాయి. అందుకేనేమో అధరామృతం అని కవులు వర్ణిస్తారు. అయితే ఇంత ప్రధాన పాత్రను పోషించే పెదాలు పగిలితే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంతే చర్మం పైన 16 పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే చర్మంపై మాత్రం 3 నుంచి 4 పొరలు మాత్రమే ఉంటాయి. అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే పెదవుల పగలకుందా ఉందేందుకు చిన్న చిట్కాలు మీకోసం…

1. పెదవులపై ఆలివ్ ఆయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

2. సగం నిమ్మకాయ ముక్కపై పంచదార అద్ది పెదవులపై గుండ్రంగా రుద్దాలి. ఇలా పది నిమిషాల పాటు చేసి చల్లని నీటితో కడిగేస్తే పెదవుల తేమ పోకుండా ఉంటుంది.

3. రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.

4. కొబ్బరినూనెలో రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి పెదవులకు రాస్తే కూడా ఈ సమస్య తగ్గుతుంది.

5. రోజూ పెదవులకు తేనె రాసుకుంటే అక్కడి చర్మం నుంచి తేమ వెళ్లిపోకుండా కాపాడుతుంది. పగిలిన పెదవులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా కూడా తేనె నివారిస్తుంది.

ఇక మృదువైన లేలేత పెదాలను ఇంత్లో ఉన్న చిట్కాలతో కాపాడుకుందామా..!