పెదవుల సంరక్షణకై సహజమైన పద్దతులు

lip-scrubs

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం సహజంగా మన పెదవుల సం రక్షణను మరచిపోతున్నాం, మన శరీరంలో మిగిలిన వాటిలాగానే పెదవులు కుడా ఎంతో ముఖ్యమైనవి మరియు, అందమైనవి కూడ. పొడిబారిపొయిన, సహజత్వాన్ని కోల్పొయిన పెదవుల పై చర్మం పొరలుగా ఊడిపొయి, కొత్త చర్మానికి బాటలు వేస్తుంది, దీని కొసం మార్కెట్లో ఎన్నో Scrub’s  లభిస్తాయి,కానీ మీ ఇంట్లోనే స్వతహాగా మీరే సహజత్వంతో కూడిన Scrub’s తయారుచేసుకోవచ్చు  .

Sleeveless Blouse designs

 ఇంట్లో తయారు చేసుకునే “లిప్ Scrub” వల్ల ఉపయోగాలు:

 పగిలిన పెదాలను నయం చేస్తూ పెదాలు పగలకుండా సం రక్షిస్తుంది , మొద్దుబారిపోయిన, మరియు తది ఆరిపోయిన పెదాలను లేతగా, మ్రుదువుగా, మరియూ అందంగా మార్చి రక్షిస్తుంది. పెదవుల రంగుని కాపాడుతూ సం రక్షిస్తుంది  .

 

ఫంచధారతో తయారు చేసుకునే “లిప్ Scrub”

 పంచదార మన శరీరాన్నే కాకుండా మన పెదవుల సం రక్షణలో కుడా ఎంతో ఉపయోగపడుతుంది.

మీరు ఉప్పుని కుడా పెదవుల  రక్షణకు ఉపయోగించుకోవచ్చు, కాని పంచదార లొని తీపితనం ముందు ఉప్పు నిరుపయోగం అయిపోతుంది.

మీరు తయారు చేసుకునే “Scrub”లో కొంచెం తేనెను కలిపితె అది మరింత రుచికరంగా మారుతుంది.   

Subscribe to Blog via Email

Join 9,405 other subscribers

కావలసినవి,

 1 Tbsp పంచదార, 1 Tbsp తేనె , 1 Tbsp అలీవ్ నూనె

ఈ 3 కలిసిన మిశ్రమాన్ని పెదవులకు రాసి వేళ్ళతో మెల్లగ రుద్దాలి  కాసేపటి తరువాత గొరు వెచ్చని  నీటితో కడిగేసి “లిప్ బాం” రాస్తే మెరుగైన ఫలితం లబిస్తుంది”

 

“కాఫీ లిప్ Scrub”

ఇది పైన సూచించిన పంచదార పద్దతి కన్నా  ఎంతో సులభం అయినది మరియు పొడిబారిన పెదవుల్ని సం రక్షిస్తుంది 

 కావలసినవి:

1 Tbsp మెత్తటి కాఫీ పౌడరు

1 Tbsp ఆలీవ్ నూనె

 ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి వేళ్ళతో మెల్లగ రుద్దాలి  కాసేపటి తరువాత నీటితో కడిగేసి “కొబ్బరి నూనె ” రాస్తే మెరుగైన, మరియు మ్రుదువైన మెత్తని పెదవులు పొందవచ్చు

 ఇంకొక తేలికైన, చిట్కా ఎమిటంటే మీ పెదవుల్ని మెత్తటి బ్రష్ తీసుకుని  కొంచెం నీటితో కాని,”ఆలీవ్   నూనె”తో కాని పెదాలకు రాయాలి ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే పగిలిన పెదవులనుండి విముక్తి లబిస్తుంది , అంతేకాకుండా మి పెదవులు అందంగా మ్రుదువుగా, ఉంతాయి….

 

Keep Smiling Always with your Lovely Lips..