లైపో తో ఎటు వైపో

సున్నాకు విలువలేదనే రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు సున్నాకే విలువెక్కువ!!అవును ఇది ముమ్మాటికీ నిజం ఈ రోజుల్లో కుర్రకారు నుంచీ వయస్సు మల్లిన వాళ్ళు సైతం జీరో సైజ్ కోసం తెగ ఆరాటపడేవాళ్ళే. మరి ఈ జీరో సైజ్ ఆట్టే వస్తుందా అంటే హుమ్మ్న్..కాస్త కష్టమే మరి జిం లు, యోగాలు, ఇతరత్రాలు ఎన్ని చేసినా ఫలితం కాస్త కష్టంగా. లేట్ గానే వస్తుంది. మరి కొన్ని గంటల్లోనే స్లిం అవ్వాలంటే???ఏముంది లైపోసక్షన్ పద్దతిలోనే.

లైపో సక్షన్ పద్దతి ద్వారా మన శరీరంలో అవాంచితమైన కొవ్వును తీసెయ్యటం. ఇది ఒక కాస్మెటిక్ పద్దతి. ఇక ఈ పద్దతి ద్వారా శరీరంలో ఉన్న అవాంచితమైన కొవ్వును తీసెయ్యటం అలాగే శరీర ఆకృతిని మరింత మెండుగా కనిపించేలా చేస్తుంది. ఈ లైపో సక్షన్ లో ఒక పీల్చే విధానంతో జరుపుతారు. ఈ ఆపరేషన్లో ఒక ట్యూబ్ ను అమర్చి, దాని ద్వారా శరీరంలోని అవాంచిత కొవ్వు ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ప్రదేశాలలో తీసివేయటం జరుగుతుంది. ఈ ట్యూబ్ ద్వారా ఆ విధానం జరుగుపుతారు. ఈ పద్దతి ద్వారా శరీరంలోని నడుము, చేతులు, తొడలు, పిరుదులు, ఇతర అంగాల వద్ద పేరుకున్న ఎక్కువ కొవ్వును తీసివేయవచ్చు.

దుష్ప్రభావాలు

ఇక ఈ విధానం ద్వారా ఎంత మంచి ఫలితముందో అంతే దుష్ప్రభావాలు ఉన్నాయ్స. రిగ్గా లైపో సక్షన్ విజయవంతం కాకపోతే అంతే దుష్ఫలితాలు ఎదుర్కోవలసివస్తుంది. ఈ  ఫలితాలెదుర్కోవాలన్నా అంతే మార్కెట్లో మంచి పేరు అనుభవం ఉన్న వైద్య నిపుణుడు అవసరం.

శరీర ఆకృతి పాడవ్వటం

ఇంకో దుష్పలితానికొస్తే లైపో సక్షన్ అయ్యాక కొందరి శరీర ఆకృతి పాడవ్వటం జరుగుతుంది. దీనివల్ల మరలా ఇంకో సర్జరీ ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఒక్కసారి ఆకృతి మారితే చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది.

లైపో అయ్యక మరలా బరువు పెరిగే అవకాశం

ఒకసారి లైపో సక్షన్ అయిపోతే బరువు పెరగమని అనుకుంటే పొరబాటే. కొందరు లైపో అయ్యాక కూడా అవే క్రొవ్వు పదార్ధాలు, జంక్ ఫుడ్స్ తింటారు. అప్పుడు వెంటనే కొన్ని వారాలలోనే మరలా బరువు చాలా ఈజీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లైపో అనేది గ్యారంటీ ఉన్న ప్రక్రియ కాదు.

ఆర్ధికపరంగా లైపో చాలా కష్టమే

ఆర్ధికపరంగా చూస్తే లైపో ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్నది. పేద అలాగే మధ్య తరగతి వారికి ఇది చాలా కష్టమైన భారమైనది.

లైపో పై భయం

లైపో సక్షన్ పై కొందరు తమ భయాన్ని వ్యక్తం చేశారు. లైపో అయ్యాక పోస్ట్ ఆపెరాటివె చూసుకుంటే చాలా ఇబ్బందులెదుర్కున్న వారూ ఉన్నారు. కొందరు వ్యక్తపరిచిన భయమేంటంటే లైపో విధానంలో బొడ్డు లో నుంచీ కోత అనగా సక్కింగ్ చేయటం మొదలవుతుంది. ఇది కాస్త భయాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధానం వల్ల మామూలు చర్మం ఇబ్బందికి లోను అవుతుంది. అయినా భయం దూరం చేసేందుకూ క్రీం ఉంది.

లైపో ద్వార సత్ఫలితాలు

ఈ విధానం ద్వార ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయ్. అవును ఇది ముమ్మాటికీ నిజమే. ఆపరేషన్ విజయవంతం అయితే ఎన్నో సత్ఫలితాలున్నాయి.

స్లిం, అందమైనా ఆకృతి

లైపో ద్వారా స్లింగా అందంగా కనిపిస్తారు. శరీరంలోని అవ్వాంచ్చితమైన కొవ్వును కరిగించటం వల్ల మీ శరీరం ఎంతో అందంగా, స్లింగా ఉంటుంది.

లైపోతో ఆత్మ విశ్వాసం

లైపో ద్వారా ఆత్మ విశ్వాసం పదింతలవుతుంది. ఎందుకంటే లావుగా ఉండటం వల్ల అందరిలో కాస్త చిన్న బుచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాకా స్నేహితుల్లో, చుట్టాల్లో కాస్త బిడియంతో చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. కానీ లైపో ద్వారా మంచి శరీరాకృతి పొంది మరింతా ఆత్మ విశ్వాసాన్ని పొందుతారు.

త్వరగా కొవ్వును కరిగించుకోవాలంటే

శరీరంలోని కొవ్వును త్వరగా కరిగించుకోవాలనుకుంటే ఈ విధ్ధానం ఎంతో మంచిది. ఇది కొన్ని గంటల పనే. అలాగే లైపో అయిన 1 లేదా 2 వారాలో మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. వ్యాయామాలు, డైటింగ్లు ఇవి కాస్తా ఆలస్యమైన విధానాలు. కాబట్టి మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఇది ఉత్తమమమైన పద్దతి.

కొన్ని అంగాలకు మాత్రమే చేయించికుంటే

అవును..ఇది నిజమే, శరీరం మొత్తం కాకుండా ఎక్కడైతే మీకు కొవ్వు ఎక్కువో అక్కడ మాత్రమే లైపో చేయించుకుంటే ఎంతో మంచిది. ఇది చాలా సులువు కూడా మీరు ఖర్చు భరిస్తే!