X
    Categories: సౌందర్యంహెయిర్ కేర్

వర్షాకాలంలో మీ జుట్టుకి తీసుకోవలసిన జాగ్రత్తలు..

వర్షాకాలం అంటే ఎంతోమందికి ఇస్టం అయినది, సరదాగా తడచి హాట్, హాట్ కాఫీ తాగితే ఆ మజాయే వేరు, కాకపోతే ఎంత సరదానో అంతే ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి ఏమిటంటారా, రండి చూసేద్దాం.

  • వర్షాకాలం అనేది అన్ని ఋతువులలో కల్లా ఎంతో ప్రత్యేకమైనది, అంతే కాకుండా ఎన్నో ప్రత్యేకతలతో కూడినది, ఈ కాలంలో తడితనం అంటే తేమ ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మీ జుట్టుకి చుండ్రు పట్టే అవకాశాలు ఎక్కువ.ఈ చుండ్రు వల్ల మన జుట్టే కాదు మంచి అందం కుడా పాడైపోతుంది.
  •  వర్షాకాలంలో వర్ష శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీ జుట్టుని తడవనివ్వకండి,ఎక్కువగా తడిస్తే మీ జుట్టూ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.మీ జుట్టుని కాపాడుకోవడానికి “గొడుగులు”,”Caps” ఉపయోగించండి.
  • ఒకవేళ అనుకోని పరిస్తితుల్లో మీ జుట్టూ తడిచిపొయినట్లయితే వీలైనంత త్వరగా తుడుచుకుని ఆరబెట్టుకోండి.
  •  వారంలో 2-3 సార్లు తలస్నానం చేయండి, అలా చేయడం వల్ల మీ జుట్టు మొదళ్ళు శుబ్రముగా వుండి, ఏరకమైన జుట్టుకి సంబందించిన వ్యాదులు(చుండ్రు,ఫంగస్”)  సోకవు.
  •  మీ జుట్టుని సాద్యమైనంతవరకు తడిగా ఉండనివ్వరాదు,అలా ఉన్నప్పుడు గట్టిగా కట్టకూడదు.
  • అందమైన, మెరిసే జుట్టు కోసం “హెయిర్  కండిషనర్లు” ఉపయోగించండి.
  • ఎక్కువ శాతం నీరు,పళ్ళ రసములు తాగడం మంచిది.
  • ఈ కాలంలో కొద్ది కొద్దిగా జుట్టు వూడిపోవడం సహజం, కంగారుపడనవసరం లేదు, “హెయిర్ కర్లింగ్”,మొదలగు విధానాలు మానుకోవడం మంచిది, వీటి వల్ల జుట్టు పాడైపొయే అవకాశం ఎక్కువ.
  • ఒకవేళ మీకు  తీవ్రమైన సమస్యలు తలెత్తితే, చర్మానికి లేదా జుట్టుకి సంబందించిన వైద్యుల్న్ని (dermatologist or trichologist)సంప్రదించడం ఎంతో మంచిది.

 

చేయవల్సినవి:

  •  వారానికి 2-3 సార్లు తలస్నానం చేయండి.
  • తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పెట్టుకుని తరువాత చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  •  విటమిన్ “E” కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకొండి.

 

చేయకుడనివి:

  • మీ జుట్టుని తడిగా ఉంచరాదు.
  • తడిగా ఉన్నప్పుడు దువ్వరాదు.
  • వర్షాకాలంలో “Dryers” ఉపయోగించకపోవడం మంచిది.

 

పైన సూచించినవన్నీ మీ అందమైన, మరియు ఆరోగ్యవంతమైన జుట్టుకోసమే, పాటించండి.

విజయ్ :