శస్త్రచికిత్స లేకుండా అధికంగా ఉన్న “చాతి భాగమును(బ్రెస్ట్)” ని తగ్గించుకోవడం ఎలా??

breast reduction

అందానికి మారుపేరు అయిన అమ్మయిలు,ఎన్నో రకముల ఇబ్బందులు పడుతూ ఉంటారు,అందులో ఆరోగ్య సమస్యలు కొన్ని అయితే, మరికొన్ని శారీరక సమస్యలు,అందులో అధిక చాతి భాగం(బ్రెస్ట్) కలిగి ఉన్న స్త్రీలు అందరికి ఆకర్షితులై,ఆకతాయుల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు
నలిగిపోతూ,ఎన్నో ఆటు,పోట్లు అనుభవిస్తూ,ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు.అంతేకాకుండా శారీరకంగా కూడా అధిక భరువు కలిగిన చాతి వల్ల నడుము,భుజాలు,మెడ ప్రాంతంలో నొప్పితో బాదపడుతూ ఉంటారు.
ఈ అధికమైన చాతి కలిగి ఉండడం వల్ల మీరు మీకు నచ్చినవి,అందమైన దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అంతే కాకుండా ఇది మీ సౌందర్యం పై కూడా ప్రబావం చూపించి మీరు సరదాగ, బయటకు వెళ్ళాలన్నా,షాపింగ్ కి వెళ్ళాలన్న,ఎంతో ఇబ్బంది పడుతూ
ఉంటారు.
అయితే, ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది,అలానే మీ చేతి సమస్యను దూరం చేసి మీరు కూడా అందరిలా సరిసమానమైన చాతితో ఉండాలంటే శస్త్రచికిత్స లేకుండా,మీ ఇంట్లోనే సహజ పద్దతులు కొన్ని ఉన్నాయి, అవి ఎంటో చూసేద్దామా.

రొమ్ము పరిమాణం తగ్గించడానికి సహజ మార్గాలు:

మీ శరీర బరువుని “BMI” ప్రకారం ఉండేలా చూసుకోండి:

మీ శరీర బరువుని మీ వయస్సు ప్రకారం ఎంత ఉండాలో అంతే ఉండేలా చూసుకోవాలి,ఒకవేళ ఎక్కువ ఉన్నట్లైతే తగ్గించుకోవడానికి పళ్ళు, కూరగాయలు,బీన్స్, తృణధాన్యాలు,కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు,ఆకు కూరలు,గింజలు తీసుకోవాలి,అలాకాకుండా బాగా వేయించిన
ఆహారం,తీపి ఎక్కువగా ఉండే పదార్దాలు తీసుకోవడం మంచిది కాదు.

చాతి పరిమాణాన్ని తగ్గించడానికి మాత్రలు(మెడిసన్):

మీ ఈ చాతి సమస్య నుండి విముక్తి పొందడానికి అనేక మూలికలతో తయరు చేసిన మాత్రలు లభిస్తాయి.అయితే,ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ ఏరకమైన దుష్ప్రబావాలు కలగకుండా కాపాడతాయి.ఇవి మీ చాతి పరిమాణాన్ని తగ్గించడంలో ఎన్నో అద్భుతాలు
చేస్తాయి అనడంలో సందేహం లేదు.

చాతి పరిమాణాన్ని తగ్గించడానికి లోషన్స్ మరియు ఔషద పదార్దాలు:

మీ చాతిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి,అధిక బరువుని తగ్గించుకోవడానికి అనేక లోషన్స్ మరియు ఔషద పదార్దాలు ఎన్నో ఉన్నాయి,మీరు చేయవలసిందల్ల అవి మీ చాతి భాగం పై రాసుకుని,మసాజ్ చేసుకుంటే మీ చాతి పరిమాణం తగ్గి, మంచి ఆకారం
లబిస్తుంది.

సరిగ్గా సరిపొయే బ్రా:

మీ చాతి పరిమాణాన్ని రక్షించుకోవడంలో మీరు వేసుకునే బ్రాలు సరియైనవిగా,మీ చాతికి సరిగ్గా సరిపోయేవి తీసుకోవాలి,అలా వేసుకుంటే దాదాపుగా ఒక కప్పు పరిమాణం తగ్గి, మీ చాతి భాగం అందమైన ఆకారంతో కనపడుతుంది.

రొమ్ము తగ్గింపు వ్యాయామాలు:

ఖచ్చితంగా అనేక రొమ్ము తగ్గింపు వ్యాయామాలు ఉన్నాయి,అందులో ముఖ్యమైనవి బోటింగ్, జాగింగ్, చురుకైన వాకింగ్,సైక్లింగ్ ఇలా చేస్తే మీ చాతి పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
మీ శరీరాకృతిని చూసి ఆందోళన చెందకుండా ఈ పై సూచించిన వన్నీ ఉపయాగించి ఆనందంగా,ప్రశాంతంగా జీవించండి.